ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి అధిపతి. నయా రాజరికంలో అధికార కేంద్రం.. అలాంటి ఓ ముఖ్యమంత్రి ఆస్తులు ఎంత ఉంటాయి.. కోట్లలోనే కదా.. ఎన్ని కోట్లు ఉండొచ్చు.. ఒక్కో ముఖ్యమంత్రి ఒక్కో రేంజ్ లో సంపాదిస్తారు.. కానీ సంపాదించిందంతా లెక్కల్లో చూపిస్తారా.. కుటుంబసభ్యుల పేరు మీదో.. బినామీల పేరు మీదో పెట్టేస్తారు.. కానీ అందరూ అలా ఉండరు లెండి.. 

MANIK SARKAR కోసం చిత్ర ఫలితం
ఉదాహరణ కింద ఈ త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ను చూడండి.. ఆయన ఇరవయ్యేళ్లుగా త్రిపుర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఆయన ఆస్తి 3930.. ఈ నెంబర్ చూసి కోట్లు అనుకునేరు సుమా.. అవి అక్షరాలా రూపాయలే.. అంటే ఆయన ఆస్తి కేవలం సుమారు 4 వేల రూపాయలు మాత్రమే. అవి కూడా బ్యాంకు ఖాతాలో రూ.2,410 ఉంటే... చేతిలో ఉన్నది 1520 రూపాయలు మాత్రమే. అవును ఇది నమ్మలేని నిజమే.. 

MANIK SARKAR కోసం చిత్ర ఫలితం
ఓ ప్రైవేటు ఉద్యోగి వద్ద కూడా ఇంతకంటే ఎక్కువే ఉంటాయి కదా అనుకుంటున్నారా. దానికీ ఓ కారణం ఉంది. 20 ఏళ్లుగా తనకు ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న జీతాన్ని సీపీఎం పార్టీకే ఇచ్చేస్తున్నారు. ఇది పార్టీ విరాళం కింద ఇచ్చేస్తారు. మరి ఆయనకు ఖర్చుల కోసం ఎలా అంటారా.. పార్టీ ఆయనకు నెలవారీ భృతి మంజూరు చేస్తుంది. అది ఎంతో తెలుసా.. 9700 రూపాయలు. అందులోనే ఆయన నెలవారీ ఖర్చులు వెళ్లదీసుకోవాలి. 

MANIK SARKAR కోసం చిత్ర ఫలితం
ఈ వివరాలన్నీ ఆయన ఇటీవల సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ద్వారా వెల్లడయ్యాయి. ఇక ఆయన మిగిలిన ఆస్తుల విషయానికి వస్తే.. అగర్తలలో ఆయనకు కొద్ది పాటి స్థలం మాత్రం ఉంది. అది కూడా ఆయన అన్నదమ్ములతో కలిపి ఉంది. మాణిక్ సర్కార్ భార్య ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైరయ్యారు.ఆమె బ్యాంక్ ఖాతాలలో12.15 లక్షల రూపాయలు ఉన్నాయి ఆయనకు సెల్ ఫోన్‌ కూడా లేకపోవడం విశేషం. దేశంలో ఇంతకంటే సింపుల్ సీఎం ఉంటారా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: