రాష్ట్రం విడిపోవడానికి వైఎస్సారే అసలు కారకుడని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసాడు. రాష్ట్ర విభజన ప్రకటన వెలుబడిన 9రోజులకు మౌనం వీడిన ముఖ్యమంత్రి కిరణ్ గురువారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చి నోరు విప్పాడు. టిఆర్ఎస్ పుట్టకముందే 2001-2002లోనే తెలంగాణ కాంగ్రేస్ ఎమ్మెల్యేలందరిని తీసుకుని సోనియా వద్దకు వెల్లి తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరడమే దీనికి మూలం అన్నారు సిఎం.

ఆతరువాత చంద్రబాబు నాయుడు 2008లో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం మరో కారణమన్నారు. బాబు, వైఎస్సార్ లే నేటి పరిస్థితికి అసలు కారకులుని చెప్పారు. తాను మాత్రం తెలుగుజాతి కలిసుండాలని కోరుకుంటానన్నాడు. ప్రస్థుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చాలా నష్టాలు తెస్థుందని చెప్పారు. వీటన్నింటిని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

ఉదహరణకు శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు తెలంగాణ నుంచి వస్థాయి, దీని కింద 30నుంచి 35 లక్షల ఎకరాలు ఆంధ్రాలో సాగవుతాయి, దీనిని ఎలా పంచుతారు. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద కుడికాల్వకింద పూర్థిగా ఆంధ్రాప్రాంతం, ఎడమ కాల్వ ముందుగా తెలంగాణ భూములకు నీళ్చిచ్చి తరవాత ఆంధ్రాప్రాంతానికి వస్థుందని చెప్పారు. అలాగే పోలవరం తదితర ఎన్నో ప్రాజెక్టుల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. అలాగే విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఉంది, ఇవన్నీ ఎలా పంచుతారు అన్నది తేలాల్సి ఉందన్నారు.

ఆవేశానికి లోనై ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. వర్షాలు సమృద్దిగా కురిసి రైతులు ఆనందంలో ఉన్నారని, ఈ సమయంలో ఉద్యోగులు సమ్మెకు దిగితే రైతులు నష్టపోతారని అందుకే సమ్మె విరమించాలని కోరారు. వీరికోసం క్యాబినెట్ సబ్ కమిటి ఏర్పాటు చేసామన్నారు. ఆంటోని కమిటీని హైదరాబాద్ కు ఆహ్వనించి మీఅభిప్రాయాలు తెలిపే అవకాశం ఇక్కడే కల్పిస్థామని చెప్పారు. విద్యార్థులు, ఇతరులు కూడా తెలుపవచ్చన్నారు. జాతీయ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని ఖండించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్థామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: