వరుస హత్యాకాండలతో రాజధాని నగరం ఎరుపెక్కింది. కొన్ని రోజులుగా భాగ్యనగరంలో హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది.  ఓ వైపు విశ్వనగరంగా తీర్చి దిద్దాలని టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే..అదే స్థాయిలో నేరాలు, ఘోరల సంఖ్య కూడా పెరిగిపోతుంది.  గత వారం రోజులుగా వరుస హత్యలు, హత్యాచారాలు హైదరాబాద్ నగరాన్ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఒక్కరోజే ఇద్దరు యువతుల హత్యోదంతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కోండాపూర్‌ వద్ద గోనె సంచిలో యువతి మృతదేహాన్ని గుర్తించిన కొద్దిసేపటికే.. హయత్‌ నగర్‌లో ఓ విద్యార్థిని హత్యకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది.
Hyderabad : two young women killed in separate accidents - Sakshi
కొండాపూర్‌లోని శ్రీరాంనగర్‌ కాలనీ బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో స్థానికులు ఒక మూటను గుర్తించి పోలీసులను సమాచారం అందించారు. తెరిచి చూడగా.. ముక్కలుగా నరికిన మృతదేహం కనిపించింది. ఆనవాళ్లను బట్టి హత్యకు గురైంది ఓ మహిళ అని పోలీసులు నిర్ధారించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతూ.. హయత్‌ నగర్‌లో హత్యకు గురైన యువతిని అనూషగా గుర్తించారు. బండరాయితో తలపై బలంగా మోది ఆమెను హత్యచేశారు.  నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన అనూష.. కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్నట్లు పోలీసులు చెప్పారు. 
Image result for హైదరాబాద్ లో హత్య గోనె సంచిలో
 హైదరాబాద్ నగరంలో బ‌త‌కాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉండాల్సి వ‌స్తుంది.   తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. అభం శుభం తెలియ‌ని మూడునెల‌ల చిన్నారి త‌ల‌ను భ‌వ‌నంపై నుంచి ప‌డేశారు గుర్తు తెలియ‌ని కిరాత‌కులు. ఈ ఘెర‌మైన దుర్ఘ‌ల‌న ఉప్ప‌ల్ లోని చిలుకాన‌గ‌ర్‌లో చోటుచేసుకుంది.
Image result for murder
చిలుకాన‌గ‌ర్‌కు చెందిన హ‌నుమంతు అనే వ్య‌క్తి ఇంటిపై నుంచి ఓ చిన్నారి త‌ల గుర్తించిన య‌జ‌మాని.. భ‌యంతో వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. ఇంత కిరాత‌కంగా, ఇలాంటి దారుణానికి ఒడిగ‌ట్టింది ఎవ‌ర‌ని పోలీసులు నిర్ఘాంత‌పోయారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే చుట్టుపక్కల ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా..ఉంటే ఆ నింధితులు ఎవరనేది గుర్తు పట్టవచ్చని పోలీసులు అంటున్నారు.  కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్ప‌డ్డ వారి గురించి గాలిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: