ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కేసులో ఇంకొకరికి ఊరట లభించింది. జగన్ అక్రమార్కుల కేసు నుంచి ఇటీవల ఒక్కొక్కరే క్రమంగా బయటపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.ఇదే సమయంలో ఓ జాతీయ ఛానల్ జగన్ పై కుట్రపూరితంగా కేసులు పెట్టారంటూ సంచలన కథనం ప్రసారం చేసింది. క్రమంగా జగన్ కు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఇంకొకరికి రిలీఫ్ దొరికింది.


జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధిత్యనాథ్ దాస్ కు తాత్కాలికంగా ఊరట లభించింది. ఇండియా సిమెంట్స్ చార్జ్ షీట్ లో నిందితుడిగా ఉన్న ఆదిత్యనాథ్ కు అభియోగాల నమోదు ప్రక్రియను నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.


వైఎస్ హయాంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఇండియా సిమెంట్స్ కు నీటి కేటాయింపుల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. సీబీఐ ఛార్జ్ షీట్ ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ ఆదిత్యనాథ్ దాస్ పై అభియోగపత్రం సమర్పించింది. తనపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఆదిత్యనాథ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.


తనపై సీబీఐ కేసును హైకోర్టు కొట్టివేసిందని ప్రస్తావించారు. ఆదిత్యనాథ్ దాస్ వ్యాజ్యంపై కౌంటరు దాఖలు చేసేందుకు ఈడీ సమయం కోరింది. నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఈడీని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం... అప్పటి వరకు ఆదిత్యనాథ్ దాస్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. అభియోగాల నమోదు ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: