దొంగలు పలు రకములు.. సాధారణంగా దొంగలు డబ్బు, నగలు, ఏవైనా విలువైన వస్తువులు దొంగలిస్తుంటారు.  ప్రపంచంలో ఏ దొంగ అయినా..ఇదే చేస్తుంటారు.  కాకపోతే ఈ మద్య కొంత మంది సైబర్ దొంగలు కొన్ని విలువైన డేటాను కూడా దొంగతనాలు చేస్తున్నారు.  అత్యంత టెక్నాలజీ ఉపయోగించి హ్యాకింగ్ చేస్తూ..కొన్ని బ్యాంకుల్లో ఉన్న డబ్బు కూడా లూటీ చేస్తున్నారు.  అయితే తూర్పు చైనాలోని జియాంగ్సూ ప్రాంతంలో ఓ దొంగ చాలా విచిత్రమైన దొంగతనం చేసి సంచలనం సృష్టించాడు.

వివరాల్లోకి వెళితే..తూర్పు చైనాలోని జియాంగ్సూ ప్రాంతంలో ఝూ   రాత్రికి రాత్రే 800 మీటర్ల పొడవైన రోడ్డును దొంగిలించాడు.  దీన్ని గుర్తించిన గ్రామస్తులు రోడ్డు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు ఝూ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఝా చెప్పిన విషయం విని పోలీసులు కళ్లు తేలేశారు.
Image result for road
తనకు డబ్బు అవసరమని అయితే డబ్బు సంపాదించాలంటే..ఏదైనా పెద్ద దొంగతనం చేస్తే బాగా డబ్బు సంపాదించవొచ్చని అందుకే  రోడ్డును తవ్వి, ట్రాక్టర్ పై తరలించి, కాంక్రీట్ స్టోన్ మెటీరియల్ ఫ్యాక్టరీకి అమ్మేశానని అతను ఒప్పుకున్నాడు.  ఈ నేపధ్యంలో ఎవరూ అంతగా వినియోగించని రహదారి కనిపించింది.
దీంతో రోడ్డు తవ్వేసి కాంక్రీట్‌ను ఫ్యాక్టరీకి అమ్మేశానని’ చెప్పాడు. వార్త తెలుసుకున్న నెటిజన్లు ఇది ‘ఇన్నోవేటివ్ ఐడియా’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.ఈ వార్త చైనాలో సోషల్ మీడియా వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: