సీనియర్ నటుడు మోహన్ బాబు పై ఓ మహిళా టీచర్ కేసు పెట్టడం ఆసక్తి రేపుతోంది. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికలో ఆసక్తికర కథనం ప్రచురితమైంది. మోహన్ బాబు సినిమాలే కాకుండా విద్యారంగంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంగతి తెలిసిందే. తిరుపతి సమీపంలో ఆయన శ్రీవిద్యానికేతన్ అనే పాఠశాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఆ పాఠశాలకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. 

mohan babu sri vidya niketan కోసం చిత్ర ఫలితం
ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఓ టీచర్ ను ఇటీవల మోహన్ బాబు తొలగించారట. అందుకు కారణం ఏంటో తెలుసా.. సదరు లేడీ టీచర్ ప్యాంట్ షర్ట్ తో పాఠశాలకు హాజరుకావడమే. అయితే  పాఠశాలల్లో డ్రెస్ కోడ్ ఎలా ఉందో తెలియదు కానీ.. ఆ టీచర్ ఓ ఆంగ్లో ఇండియన్ ను వివాహం చేసుకున్నారు. ఒక వేళ పాఠశాల నిబంధన అలా ఉంటే ఆ కారణంతోనే సస్పెండ్ చేసి ఉండాల్సింది.. 

mohan babu sri vidya niketan కోసం చిత్ర ఫలితం
కానీ అలా కాకుండా సస్పెన్షన్ కు కారణం మాత్రం సిలబస్ కంప్లీట్ చేయలేదని శ్రీవిద్యానికేతన యాజమాన్యం చెప్పిందట. కానీ మౌఖికంగా మాత్రం నువ్వు వేసుకున్న డ్రస్సు కారణంగానే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని నేరుగా ముఖంపైనే చెప్పేశారట. దీంతో ఆత్మాభిమానం దెబ్బతిన్న ఆ టీచర్ న్యాయపోరాటానికి దిగారట. మోహన్ బాబుకు లీగల్ నోటీసు పంపించిందట.

mohan babu sri vidya niketan కోసం చిత్ర ఫలితం
శ్రీవిద్యానికేతన యాజమాన్యం తన ఆత్మగౌరవానికి దెబ్బ తగిలేలా వ్యవహరించందని ఆమె తన నోటీసులో పేర్కొన్నారు. తనకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తోందట. అంతే కాదు.. తనకు జరిగిన అవమానానికి పరిహారం చెల్లించాలని... తిరిగిన తన ఉద్యోగం తనకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది. మరి మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: