దేశ ప్రధాని మోదీ మంచి వాక్చాతుర్యం గల నాయకుడు అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ప్రతిపక్షాలను ఇరుకునపెట్టాడంలో మోడీ సిద్ధహస్తుడు. అలాగే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి తప్పు జరిగినా దాన్ని విపక్షానికి అస్త్రం కాకుండా మోడీ వ్యవహరించే తీరు చాలా భిన్నంగా  ఉంటుంది. అంతేకాకుండా రాజకీయ రంగంలో మీడియాను మేనేజ్ చేయడంలో గుప్పిట్లో పెట్టుకోవడంలో మోడీని మించిన వారు ఎవరు లేరు.


అయితే గత కొన్ని రోజులుగా ఏపీ ఎంపీలు చేస్తున్న నిరసనలు జ్వాలలు దేశం మొత్తం చూస్తూనే ఉంది. ఇన్ని జరుగుతున్నా సరే మోడీ తనదైన శైలిలో మీడియాలో హైప్ రాకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఏపీ కి సంభందించిన మీడియాలో మోడీ ప్రతిష్టకి భంగం కలుగకుండా ఎప్పటికప్పుడు కాపుకాస్తోంది ఓ తెలుగు ఆంగ్ల దినపత్రిక.


ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయాన్ని విపులంగా జయదేవ్ తెలియజెప్పాడు. మోడీ ఏపీకి ఇచ్చిన మాటల్ని ఏ విధంగా మార్చారో క్లుప్తంగా తెలిపారు. దేశం మొత్తం గల్లా వ్యాఖ్యలకి ప్రసంగానికి ఫిదా అయితే ఆ అగ్ర దినపత్రిక మాత్రం.. ఈ జయదేవ్ వార్తకి ప్రాధాన్యతని ఇవ్వకుండా లోపల ఎక్కడో ప్రచురించింది.


అయితే అదే పత్రిక మాత్రం మోడీ కాంగ్రెస్ ని విమర్శించిన విదానాన్ని మాత్రం పెద్ద పెద్ద అక్షరాలతో వేసింది. అయితే ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జర్నలిజం చేస్తే బాగుంటుంది. అంతేగానీ వ్యక్తుల కోసం వ్యవస్థలను దారి మలిచే జర్నలిజం చేస్తే సమాజాన్ని మోసం చేసిన వారమవుతాం అని అన్నారు సీనియర్ జర్నలిస్ట్ లు.



మరింత సమాచారం తెలుసుకోండి: