ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆర్థిక వనరుల లేమి ఉంటుందని..కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలనికి రాజధాని అభివృద్ది కావాలని..ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ప్రత్యేక హోదా ఉండాలని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సమ్మతం పలికింది. ఆ సమయంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ కూడా దానికి సమ్మతం పలికింది. ప్రస్తుతం బీజేపీ కేంద్రంలో పాలన కొనసాగిస్తున్నంది..కానీ ఏపీ ప్రత్యేక హోదా విషయం పై ఇప్పటి ఎలాంటి హామీ ఇవ్వలేదు. పైగా ముఖ్యమంత్రితో సంప్రదింపులు చేసి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ఒప్పందాలు చేసుకున్నారు.
Image result for chandrababu
దీనిపై ఇప్పుడు ఏపీలో ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి.  ఈ మద్య కేంద్రమంత్రి జెట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని..ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఉద్యమం చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో మొన్న ఏపీ బంద్ కూడా నిర్వహించారు. పార్లమెంట్ లో ఏపీ ఎంపీలు నిరసనలు తెలుపుతున్నారు.  ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ట్విట్టర్ లో వరుసగా ట్వీట్లు చేశారు. ఏ నైతిక విలువలతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. 
Image result for ap special status
'విభజన చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్‌ వేదికగా అప్పటి పాలక, విపక్షాలు కలిసి మాటిచ్చాయి. మార్చి 2014లో ఇదే అంశాన్ని కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది.  ఈ నేపథ్యంలో, ఏ హక్కుతో స్పెషల్ స్టేటస్ ను చంద్రబాబు తాకట్టు పెట్టారని, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని జగన్ ప్రశ్నించారు. కంటి తుడుపు చర్యలు ఆపండి. ఏపీ ప్రజలకు ఏం చేశారో చెప్పండి' అని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: