భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఎన్నో వినూత్న పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు. ముఖ్యంగా  దేశవ్యాప్తంగా ''స్వచ్ఛభారత్'' కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పాల్గొంటూ పరిశుభ్రత గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తునే ఉన్నారు.  రోడ్డు పై ఎలాంటి చెత్త లేకుండా శుభ్రంగా ఉంచితే..ఆ సమాజం..ఊరిలో చెత్త లేకుండా ఏంటే..ఊరు..దేశంలో చెత్త లేకుండా చేస్తే దేశం పరిశుభ్రంగా ఉంటారని..ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ప్రజాప్రతినిధులు సందేశాలు ఇస్తున్నారు.
Related image
ఇదిలా ఉంటే..ఈ మద్య కొంత మంది ప్రజాప్రతినిధులే స్వచ్ఛభారత్ కి విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే రాజస్థాన్ మంత్రి కాళీ చరణ్ సరఫ్.  ఆ మద్య ఓ మంత్రి రోడ్డు పై మూత్ర విసర్జన చేస్తే..సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కాళీచరణ్ సరఫ్ బహిరంగంగా మూత్ర విసర్జన చేశారు. జైపూర్‌లో ఈ ఘటన జరిగింది.
Image result for minister road side urin pass
రోడ్డు మీద బహిరంగంగా మంత్రి మూత్ర విసర్జన చేస్తున్న ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఈ విషయం కాస్త ఆయన దృష్టికి వెళ్లింది..ఈ ఘటనను మంత్రి కొట్టిపారేశారు. ఇదేమీ పెద్ద విషయంకాదన్నారాయన. పింక్ సిటీ రూల్స్ ప్రకారం ఎవరైనా రోడ్డు మీద మూత్రం పోస్తే వారికి రూ.200 జరిమానా విధిస్తారు. ఇంత చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూపించాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పడం సిగ్గుచేటు అన్నారు.
Image result for swachh bharat
ఈ విషయంపై ప్రతిపక్ష నేతలు స్పందిస్తూ..స్వచ్ఛ భారత్ అంటూ ఎన్నో వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని..మంత్రి సరఫ్ ఇలా చేయడం సరికాదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దోల్‌పూర్ ఉప ఎన్నికల సమయంలోనూ మంత్రి సరఫ్ ఇలాగే బహిరంగంగా మూత్ర విసర్జన చేశారని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: