సాధారణంగా అధికారులు కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యంగా ఉంటారన్న విషయం తెలిసిందే. కొన్ని సార్లు వీరు చేసే నిర్లక్ష్యం మూలంగా పెద్ద గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.  ఓటరు, ఆధార్ కార్డులపై సెలబ్రెటీల ఫోటోలు వచ్చాయి..హాల్ టికెట్లపై ఇతరుల ఫోటోలు రావడం చూస్తూనే ఉన్నాం.  ఎన్నిసార్లు ఇలాంటి పొరపాట్లు జరిగినా..వీరు చేసే నిర్లక్ష్యం మాత్రం మరవడం లేదు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని తెలంగాణ సీఎంగా మార్చారు. విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ వ్యవహారం బయటపడింది.  ఇంతకీ ఏం జరిగిందంటే.

ఈ సదస్సుకు సంబంధించి అధికారులు రోజువారీ ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయో... ఓ షెడ్యూల్‌ను తయారు చేశారు. దీన్ని తప్పుల తడకగా రూపొందించారు. ఏకంగా ఓ రాష్ట్రానికి సీఎంనే మార్చేయడం ఈ విషయం మీడియాలో వెలుగులోకి రావడం చేసిన పొరపాటుకు నాలుక్కరుచుకున్నారు. విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో అధికారులు రోజువారీ ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయో... ఓ షెడ్యూల్‌ను తయారు చేశారు. 
Image result for telangana
ముఖ్య మైన విషయాల్లో కూడా కొంత మంది సిబ్బంది అంత కళ్ళు మూసుకుని పని చేస్తున్నారా ? అంటే అవునని ఈ సంఘటన రుజువు చేసింది. సీఎం చంద్రబాబు పేరు కింద  చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంటూ ప్రింట్ చేశారు.
Image result for andhrapradesh
ఇప్పుడిది బయటకు రావడంతో... విమర్శలు మొదలయ్యాయి. రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన సీఐఐ సదస్సులో ఇలాంటి తప్పులు దొర్లడాన్ని తప్పుపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని భావిస్తున్నారు. మరి దీనిపై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: