సిరియాలో గత కొంత కాలంగా మారణహోమం జరుగుతూనే ఉంది.  ఓ వైపు కరువు..మరోవైను ఉగ్రదాడులు అల్లకల్లోంగా మారింది.  ప్రస్తుతం సిరియాలో రసాయనిక దాడులకు పాల్పడేం దుకు తిరుగుబాటుదారులు కుట్ర పన్నారని రష్యా రక్షణ శాఖ పేర్కొన్నది. గౌటా నగరంలోకి చొరబడి కొంతమంది పౌరులను వైపీజీ తిరుగుబాటు దారులు బంధీలుగా మల్చుకున్నారని తెలిపింది. 
Image result for సిరియా
ఈ ప్రాంతంలో 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రతా మండలి గతవారం నిర్ణయించింది. కానీ  ఐరాస నిర్ణయాన్ని తిరుగుబాటు దారులు వ్యతిరేకిస్తున్నారని దాడులకు పాల్పడే ప్రమాదముందని మేజర్‌ జనరల్‌ యూరీ యెవ్‌తుషెంకో హెచ్చరించారు.
Image result for సిరియా
సిరియాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రసాయనిక దాడులు జరిగాయని యూరీ తెలిపారు. డమాస్కస్‌లో కాల్పుల విరమణ పాటించాలని ఐరాస తీర్మానించినప్పటికీ తిరుగుబాటుదారులు విధ్వంసాలకు పాల్పడుతున్నారని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: