శ్రీదేవి బాలతారగా సినీరంగంలో అడుగుపెట్టి.. ముందుగా దక్షిణాదిని.. ఆ తర్వాత ఏకంగా దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. అంటే ఆమె ఆదాయం నాలుగో ఏట నుంచే ప్రారంభమైందన్నమాట. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆమె భారతీయ సినీరంగంలో తనదైన ముద్ర వేసుకుంది. దాదాపు 300 సినిమాలుపైగా నటించింది. ఈ లెక్కలన్నీ చూస్తే ఆమె ఆస్తిపాస్తులు వందల కోట్లలో ఉంటాయని అంచనా వేయడం సహజమే. 

sridevi house కోసం చిత్ర ఫలితం

అయితే ఆ అంచనాలన్నీ తప్పే.. ఎందుకంటే ఆమె చిన్నతనం నుంచి సంపాదించినా.. వాటిని సరిగ్గా నిర్వహించలేకపోయారు. సినీరంగంలో ఎక్కువగా బ్లాక్ మనీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఆమె ఆస్తి వ్యవహారాలు చూసుకున్న తండ్రి ఆ సొమ్మును ఇన్ కంటాక్సులకు భయపడి స్నేహితుల వద్ద, బంధువుల వద్ద బినామీగా ఉంచారు. అయితే వారంతా ఆయన్ను మోసం చేశారు. 

సోదరి సగం లాక్కుంది
ఆ తర్వాత తండ్రి మరణం తర్వాత తల్లిపై శ్రీదేవి ఆధారపడ్డారు. కానీ ఆమె శ్రీదేవి ఆదాయాన్ని వివాదాస్పద సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అక్కడా చాలా నష్టపోవాల్సి వచ్చిందట. ఈ కారణాల వల్ల ఆమె తన ఆస్తుపాస్తులు చాలా కరిగిపోయాయి. ఆ తర్వాత తల్లి అనారోగ్యం సమయంలో ఆమె చాలా ఖర్చు చేసింది. తల్లి మరణం తర్వాత మిగిలిన కొద్ది ఆస్తిని చెల్లెలు కోర్టు ద్వారా పోరాటం చేసి సగం తీసుకెళ్లిపోయింది. 

తల్లి వల్ల కూడా భారీగా నష్టం
ఇప్పుడు శ్రీదేవి ఆస్తులు లెక్కిస్తే.. ముంబైలోని ఆమె నివాసం దాదాపు 250 కోట్ల రూపాయలు చేస్తుందని అంచనా. ఇవి కాకుండా మరికొన్ని బంగాళాలు కూడా ఉన్నాయట. వాటి విలువ 50 నుంచి 70 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఇవికాకుండా చరాస్తులు ఓ 20 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. మొత్తం మీద శ్రీదేవి ఆస్తులు 300 కోట్ల నుంచి 350 కోట్లు ఉండొచ్చని సన్నిహితులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: