చంద్రబాబు రాజకీయ ప్రస్థానంకు నిన్నటితో నలభైఏళ్లు పూర్తి అయింది. ఇందునుబట్టి ఒక వార్తా ఛానెల్ ఆయనతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన తన నలభైఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎదురుకున్న ఒడిదుడుకులను, సంతోష, విచార సంఘటనలతో పాటు వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పాడు.


ఒకానొక సందర్భంలో యాంకర్ ఆయనను ప్రశ్నిస్తూ అప్పటి రాజకీయాలకు, ఇప్పటి రాజకీయాలకు గల వ్యత్యాసం ఏంటి అని, ప్రతిపక్షనేత జగన్ గురించి ఏం స్పందిస్తారు అని అడగ్గా ఆయన ఈవిధంగా స్పందించారు. "నేను చాలా మంది రాజకీయనాయకులతో కలసి పనిచేసాను. వారందరు హుందాగా వ్యవహరించేవారు. అంతెందుకు నేను జగన్ తండ్రి వైఎస్ ఉన్నప్పుడు ఆయనతో కూడా కలిసి పని చేశాను. ఆయన మాట తీరు ఎలాఉన్నప్పటికీ ఒక నాయకుడిగా నాకు ఇవ్వవలసిన గౌరవం ఇచ్చేవారు" అని ఆయన సమాధానం తెలిపారు.


ఆయన ఇంకా మాట్లాడుతూ- జగన్ అసెంబ్లీలో ప్రసంగించే తీరును చూస్తే చాలా బాధ కలుగుతుంది, ప్రజలకోసమే సహిస్తున్నా అని ఆయన వివరించాడు. తన నలభైఏళ్ల రాజకీయప్రస్థానంలో ఏనాడు కూడా ఒక్క చిన్న మచ్చలేదు, ఒక్క తప్పుకూడా చేయలేదు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి జడ్జిగారి ముందు నిర్దోషిలాగా తలవంచుకొని నిలబడే జగన్ తో తనని పోల్చడం సరి కాదు. అసలు అలా ఊహించలేము. తన తండ్రిని అడ్డంపెట్టుకొని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు అని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: