జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల పూర్తిగా రాజకీయాల లోకి వచ్చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా కేంద్రం రాష్ట్రాని సరిగా పట్టించుకోవటం లేదు అంటూ బిజెపి పార్టీ పై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కేంద్రం రాష్ట్రానికి ఏం చేసింది అన్నదానిపై నిజనిర్ధారణ కమిటీ వేయడం జరిగింది.


ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం అంటు కామెంట్ చేయడం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో బిజెపి పెద్దలు ఉలిక్కిపడ్డారు..అయితే గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరారు అని టాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది..


ఏపీ ప్రయోజనాల కోసం “జేఎఫ్సీ” గా ఏర్పడిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్…రాహుల్ గాంధీ ని కలిసి ఏపీకి జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడానికి తన సహకారం కావాలని కోరనున్నారట పవన్.


అయితే పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో 'కాంగ్రెస్ హటావో దేశ్ కి బచావో' అన్న నినాదం ఏమైంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ స్థితిలో ఉండడానికి గల కారణం అయినా కాంగ్రెస్ పార్టీని  పవన్ కళ్యాణ్ కలవడం పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో  బిజెపి పార్టీ కంగారుపడుతుంది...అలాగే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కొంత  సంతోషించింది.




మరింత సమాచారం తెలుసుకోండి: