ప్రపంచంలో డబ్బు ఎవరికి చేదు..అయితే డబ్బు సంపాదించాలంటే..నెలసరి జీతం చేస్తూ..ఏవో చిన్న వ్యాపారాలు చేస్తూ సంపాదించడం కష్టం. దాంతో కొంత మంది అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం మొదలు పెడుతున్నారు.  ఈజి మనీ కోసం హైటెక్ వ్యభిచారాన్ని ఎంచుకుంటూ..గ్రామాల నుంచి పట్టణాలకు ఉద్యోగాల కోసం వస్తున్న కొంత మంది యువతులను మాయ మాటలు చెప్పి లొంగ దీసుకుంటున్నారు.  చదువు కోసం వచ్చిన యువతులను లగ్జరీ అలవాటు చేసి వారిచే హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ..దళారులు అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు.  జనావాసాల మధ్య ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు  టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. 
Image result for hitech prostitution hyderabad
అజిత్‌సింగ్‌నగర్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి 13 మంది విటులను ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30,800, 20 సెల్‌ఫోన్లు, ఎనిమిది బైక్‌లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.  కొంత కాలంగా నిర్వాహకులు మహిళలను తీసుకు వచ్చి విటులను ఆకర్షించి ఇక్కడే వ్యాపారం కొనసాగిస్తున్నారని చుట్టు పక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Image result for hitech prostitution hyderabad
పక్కాసమాచం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి షేక్‌ ఫర్జాన, షేక్‌ అనిఫ్‌, దోరా శ్రీను, జ్యోతిలను నిర్వాహకులుగా గుర్తించారు. కేసు దర్యాప్తును అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. నిర్వాహకులపై ఐటీ యాక్ట్‌ కేసు నమోదు చేసి, వ్యభిచార కూపం నుంచి నలుగురు మహిళలకు విముక్తి కల్పించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు తెలిపారు.  గతంలో కూడా వీరు వ్యభిచార కేసులో పట్టుబడ్డారని..విడుదల కాగానే మళ్లీ ఇదే దందా మొదలు పెట్టారని ఇందు కోసం వివిధ ప్రాంతాలను ఎంచుకొని గుట్టుగా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: