ఈ మద్య త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే.  త్రిపురలో కమ్యూనిస్ట్ ఐకాన్ లెనిన్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. త్రిపురలోని బెలోనియా నగరంలో ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. తాజాగా విడుదలైన ఓ వీడియో ఇప్పుడు సంచలనమైంది.  ఈశాన్యాన త్రిపురలో రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న మాణిక్ సర్కారును గద్దె దించామన్న ఆనందంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. 
Image result for tripura votes counting
మాణిక్ సర్కారు సీఎం పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఇది జరగడం గమనార్హం. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎఫ్టీ (ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర)తో కలసి 59 అసెంబ్లీ స్థానాలకుగాను 43 స్థానాలను బీజేపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ట్రైబల్స్ కు రిజర్వ్ చేసిన 20 అసెంబ్లీ సెగ్మెంట్లలో అన్నింటినీ ఈ కూడమి గెలుచుకోవడం గమనార్హం. అధికార సీపీఎం 15 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.
Image result for లెనిన్ విగ్రహాన్ని
ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొన్ని గంటల్లోనే బీజేపీ, లెఫ్ట్ మద్దతుదారులు ఘర్షణకు దిగారు. ఆ అల్లర్ల కారణంగా దక్షిణ త్రిపురలోని బెలోనియా పట్టణంలో ఉన్న మార్కిస్టు నేత లెనిన్ విగ్రహం ధ్వంసం అయ్యింది. బుల్‌డోజర్లతో లెనిన్ విగ్రహాన్ని బీజేపీ కార్యకర్తలు కూల్చివేశారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ వాళ్లు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు తెలుస్తున్నది.
Image result for లెనిన్ విగ్రహాన్ని
ఈ ఘటన పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఆ రాష్ట్ర గవర్నర్, పోలీస్ చీఫ్‌తో ఆయన మాట్లాడారు. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు హింస చోటుచేసుకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ ఆదేశించారు. దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాల నిరంకుశత్వంపై ప్రజల ఆగ్రహానికి ఇది నిదర్శనం అంటున్నారు బీజేపీ నేతలు.

దీనిపై సీపీఎం నేతలు కూడా స్పందించారు. కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తులు.. భారత్ మాతా కీ జై అని నినాదాలు చేస్తూ.. లెనిన్ విగ్రహాన్ని కూల్చేశారని చెబుతున్నారు. కమ్యూనిస్ట్ ఫోబియో బీజేపీలో ఎలా ఉందో ఈ ఘటన చెబుతుంది అంటున్నారు సీపీఎం నేతలు. కొన్ని ప్రాంతాల్లో సీపీఎం పార్టీ కార్యాలయాపైనా దాడులు జరుగుతున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: