కేంద్రం లోని ఏపీ మంత్రులు రాజీనామా చెయ్యడం కంటే ముందరే లోకల్ లోని స్టేట్ క్యాబినెట్ లో బీజేపీ మంత్రులు రాజీనామాలు చేసి సంచలనం సృష్టించారు .. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ రాజీనామాల పర్వం సాగింది. కేంద్రం నుంచి ఆదేశాలు రాగానే ఇక్కడి బీజేపీ మంత్రులు రాజీనామాలు చేస్తారు కాబోలు అనుకుంటే రివర్స్ లో బీజేపీ మంత్రులు షాకింగ్ గా చంద్రబాబు నీ, వెంకయ్య నీ పొగిడి పడేస్తూ రాజీనామాలు చేసేసారు.


కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులు రాజీనామాలు సమర్పించడానికి రెడీ అవుతున్న తరుణంలో... ఏపీలో కూడా ఇలాంటి పరిణామాలే సంభవించాయి. బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులు తమ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజీనామా లేఖలను సమర్పించారు. సమర్పించి చంద్రబాబు మీద విమర్శలు కురిపిస్తారు అనుకుంటే రివర్స్ లో బాబు నీ వెంకయ్య నీ ఆకాశానికి ఎత్తేస్తూ భజన ప్రోగ్రాం ఒకటి పెట్టారు.


మంత్రులుగా తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరిపై చంద్రబాబు కూడా ప్రశంసలు కురిపించారు. విలువలకు కట్టుబడి పనిచేశారంటూ కితాబిచ్చారు. అయితే ఈ కథ స్క్రీన్ ప్లే మొత్తం వెంకయ్య కను సన్నల్లో నడిచింది అంటున్నారు చాలామంది.


మంత్రులుగా బీజేపీ తరఫున ఉంటూ టీడీపీ హయాం లో నడపడం అంతా అప్పట్లో వెంకయ్య ఇచ్చిన ఆఫర్ ఏ .. అయితే ఇప్పుడు వెంకయ్య మాట ని మోడీ కానీ షా గానీ లెక్కచేయ్యకపోవడం చూస్తూ ఉంటె వారికి మండే విధంగానే వెంకయ్య ఈ స్క్రీన్ ప్లే రచించినట్టు క్లియర్ గా అర్ధం అవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: