ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ 2018 ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ​రూ. 1,91,063.61 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  అమరావతిపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయని చెప్పారు. 10.96 శాతం వృద్ధి రేటును సాధించామని తెలిపారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించేలా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ భ్రుతి, కాపుల సంక్షేమం, పోలవరం ప్రాజెక్టు తదితరాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల ప్రణాళికలో అపరిష్కృతంగా ఉన్న అంశాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారు. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో గురువారం (మార్చి 8) ఉదయం 7.30 గంటలకు మంత్రిమండలి సమావేశమైంది. 2018-19 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌‌కు మంత్రిమండలి లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైన తర్వాత మంత్రివర్గానికి రాజీనామా చేసిన బీజేపీ సభ్యులు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాల రావు ప్రసంగించారు.
Image result for ఏపీ బడ్జెట్ 2018
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యావాదాలు తెలిపారు. ఆయన పనితీరును ప్రశంసించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. వారి పనితీరును మెచ్చుకున్నారు. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అతిముఖ్యమైనది కాగా ప్రత్యేక హోదా విషయం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఏమిటో చూద్దాం..!


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ 201819  ముఖ్యాంశాలు :

  • రాష్ట్ర బడ్జెట్ - రూ. 1,91,063.61 కోట్లు
  • కేపిటల్ వ్యయం అంచనా - రూ. 28,678.49 కోట్లు
  • ఆర్థిక లోటు అంచనా - రూ. 24,205.21 కోట్లు  
  • వ్యవసాయ రంగానికి - రూ. 12,355.32 కోట్లు
  • సాగునీటి రంగానికి - రూ. 16,978.23 కోట్లు
  • ఇంధన రంగానికి - రూ. 5,052.54 కోట్లు
  • సంక్షేమ రంగానికి - రూ. 13,720 కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి - రూ. 20,815.98 కోట్లు
  • మత్స్యకారుల అభివృద్ధికి - రూ. 77 కోట్లు
  • న్యాయశాఖకు - రూ. 886 కోట్లు
  • విద్యాశాఖకు - రూ. 24,185 కోట్లు
  • సాంకేతిక విద్యకు - రూ. 818 కోట్లు  
  • ఆదరణ పథకానికి - రూ. 750 కోట్లు
  • కాపు సామాజిక వర్గ విద్యార్థులకు - రూ. 400 కోట్లు
  • హిజ్రాల సంక్షేమానికి - రూ. 20 కోట్లు
  • సెకండరీ విద్యకు - రూ. 21,612 కోట్లు
  • రుణమాఫీకి - రూ. 4,100 కోట్లు
  • కాపు కార్పొరేషన్ కు - రూ. 1000 కోట్లు
  • బీసీ సంక్షేమం - రూ. 4,477 కోట్లు
  • వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాది కంటే 35 శాతం ఎక్కువ నిధులు
  • ఇరిగేషన్ కు కేటాయింపుల్లో పోలవరంకు రూ. 9,000 కోట్లు
  • పట్టణాభివృద్ధికి - రూ. 7,740 కోట్లు
  • సాధారణ సేవలకు - రూ. 56,113.17 కోట్లు
  • పరిశ్రమలు, గనులు - రూ. 3,074 కోట్లు
  • హోంశాఖకు - రూ. 6,226 కోట్లు
  • పర్యాటకశాఖకు - రూ. 290 కోట్లు
  • సీఆర్డీఏకు - రూ. 7,761 కోట్లు
  • కార్మిక, ఉపాధి కల్పనకు - రూ. 902 కోట్లు
  • క్రీడలు, యువజన సర్వీసులకు - రూ. 1,635 కోట్లు
  • గృహ నిర్మాణం - రూ. 3,679 కోట్లు
  • వైద్య రంగం - రూ. 8,679 కోట్లు
  • చేనేత కార్మికులకు - రూ. 42 కోట్లు
  • చంద్రన్న పెళ్లి కానుక (బీసీలకు) - రూ. 100 కోట్లు
  • ఈబీసీల ఫీజు రీఇంబర్స్ మెంట్ - రూ. 700 కోట్లు
  • ఎంబీసీల ఫీజు రీయింబర్స్ మెంట్ - రూ. 100 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: