అమ్మాయి.. మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటుందా.. అసలు ఇది జరుగుతుందా అనుకుంటున్నారా.. అవును అప్పుడప్పుడు ఇలాంటి కేసులు తగులుతుంటాయి. అయితే అవి ఏ లెస్బియన్ తరహా కేసులో అయి ఉంటాయి. ఇద్దరు అమ్మాయిల మధ్య బలమైన ఆకర్షణతో అది పెళ్లి వరకూ దారి తీయవచ్చు. కానీ ఇక్కడ కేసు మాత్రం అలాంటి కాదు. 

Image result for KRISHNASEN MARRIAGE
ఇది పూర్తిగా డిఫరెంట్..ఇక్కడ అమ్మాయి.. అబ్బాయిగా మారిపోయింది. తనుకు తాను అబ్బాయి వేషధారణ చేసుకుంది. అబ్బాయిగానే చెలమణీ అవుతోంది. అంతేకాదు.. అబ్బాయి వేషంలో పెళ్లి చూపులు చూస్తే ఇద్దరు అమ్మాయిలను ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంది. ఐతే.. ఇదంతా కట్నం కోసమే. కట్నం సొమ్ము చేతిలో పడగానే బిచాణా ఎత్తేయడం.. మరో పెళ్లికి తయారు కావడమే. 

Image result for KRISHNASEN MARRIAGE
కట్నాల కోసం అబ్బాయిలు ఇలా వరుసగా పెళ్లిళ్లు చేసుకోవడం చూశాం.. కానీ ఇదేం వింత అంటారా.. అంతే.. ఈ విచిత్రం ఉత్తరాఖండ్ లో జరిగింది.  ఈ మహిళ పేరు 
కృష్ణసేన్‌. స్వీటీ అని పిలుచుకునే 26 ఏళ్ల కృష్ణసేన్‌ నాలుగేళ్ల నుంచి మగ వేషంలో తిరుగుతోంది. అయితే అదనపు కట్నం కోసం కృష్ణసేన్ తన రెండో పెళ్లాన్నివేధించడంతో వారు పోలీసు కేసు పెట్టారు. అప్పుడు జరిగిన విచారణలో అసలు కృష్ణ సేన్ అబ్బాయే కాదని తేలింది. 

కృష్ణసేన్
అవును మీ సందేహం అర్థమైంది.. అమ్మాయి అయితే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేసిందా అనే కదా మీ అనుమానం.. అబ్బే కృష్ణసేన్ పెళ్లి వరకు మాత్రమే పెళ్లింది. పడకగదిలో కామ్ గా కాలం గడిపేసిందట. రేపు, మాపు అంటూ సాకులు చెప్పి మొత్తాని కట్నం సొమ్మంతా చేతికి వచ్చాక చెక్కేసేదట. బాప్ రే.. ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా అనిపిస్తోంది కదూ. 



మరింత సమాచారం తెలుసుకోండి: