ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కేంద్రమంత్రి పదవులకు టీడీపీ ఎంపీలు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేసిన నేపథ్యంలో బీజేపీ మహిళా నేత పురందేశ్వరి శుక్రవారం స్పందించారు. ఈ సందర్భంగా ఆమె  మీడియాతో  మాట్లాడుతూ ప్రత్యేకహోదాతో లాభం ఉండదని జైట్లీ చెప్పారని...జైట్లీ ప్రకటనను తప్పుగా అర్దం చేసుకున్నారని తెలిపారు. ఓ పథకం ప్రకారం తప్పును బీజేపీవైపు నెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Image result for arun jaitly
జైట్లీ ఇచ్చిన వివరణ ప్రకారం..  రాష్ట్రానికి విభజన హామీల అమలుకు పది సంవత్సరాల సమయం ఉందని అన్నారు.పదేళ్లపాటు హైదరాబాద్ లోనే ఉంటూ అన్నీ చక్కదిద్దుకునే అవకాశాన్ని వదిలేశారని గుర్తు చేసిన ఆమె, అయినప్పటికీ ఏపీకి న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అంతే కాదు కేంద్రం ఏపీకి తప్పకుండా న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. ఆర్థికలోటు పూడ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు.
Image result for ap special status
రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చిందని... ఏపీకి పన్ను రాయితీలు కొనసాగుతాయని పురందేశ్వరి చెప్పుకొచ్చారు. కేంద్రం చొరవతోనే ఏపీకి పెట్టుబడులు పెరిగాయన్నారు. కేంద్ర విద్యా సంస్థలకు తక్కువ నిధులు ఇస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం వెనుక తెలుగుదేశం నేతల హస్తం ఉందని ఆమె ఆరోపించారు.
Image result for chandrababu
ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కొనసాగించాలని కేంద్రం భావించడం లేదని పురందేశ్వరి అన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో ఏపీకి లాభమేనని ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు.టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్యను ఇరు పార్టీల అధ్యక్షులు చూసుకుంటారని చెప్పారు. కేంద్రం ఏపీకి చేసిన సాయాన్ని ప్రజల్లోకి వెళ్ళి వివరిస్తామని పురందేశ్వరి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: