మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అజ్ఞాతవాసి చిత్రం తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాన్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు.  ఇక ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీల నేతలతో సంబంధాలు కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు.  ఈనెల 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంతో పాటు, సొంత ఇల్లు కూడా రాజధాని ప్రాంతంలో ఉంటే బాగుంటుందని జనసేననాని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి మండలంలోని కాజలో రెండు ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గుంటూరులో స్వంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం పూట భూమి పూజ నిర్వహించారు.సంప్రదాయం ప్రకారంగా పవన్ కళ్యాణ్ వేద పండితుల మంత్రోఛ్చారణల మధ్య పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. 
Image result for పవన్ కళ్యాన్ భూమి పూజ
 2019 ఎన్నికలకు సంబంధించి జనసేన చీఫ్ పవన్ కళ్యాన్ అన్ని ఏర్పాట్లను చేసుకొంటున్నారు. గుంటూరులో స్వంత ఇంటి నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం భూమి పూజ చేశారు.  పవన్ కల్యాణ్ పై అశేషమైన అభిమానం చూపించే అభిమానులు, నేడు భూమిపూజ అన్న సంగతి తెలిస్తే వెల్లువలా వచ్చే అవకాశం ఉందని, వారిని నిలువరించడం కోసం దీనిని గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. 

భద్రతా కారణాల రీత్యా తన పర్యటన వివరాలను ఆయన డీజీపీకి తెలిపారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ తన భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి విజయవాడ చేరుకున్న సంగతి తెలిసిందే. కొనుగోలు చేసిన స్థలంలో నేడు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పవన్ కల్యాణ్ భూమి పూజ చేయనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: