ఈ రోజు ప్రారంభం అయిన తెలంగాణ బడ్జెట్ సమావేశంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సభను ఉద్దేశించిన ప్రసంగించారు.  ఈ సందర్భంగా ఆయన ప్రసంగం మొత్తం టీఆర్ఎస్ భజన చేస్తున్నట్లు ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు గోళ చేస్తూ ఫ్లకార్డులు చూపిస్తూ..కాగితాలు చింపుతూ నానా గందరగోళం చేశారు. 

ఈ గందరగోళం మద్యనే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు కొంత మంది గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రసంగానికి సంబంధించి పత్రాలు చించి పైకి విసిరారు.  అయితే ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  హెడ్ ఫోన్స్ పోడియం వైపు విసిరారు. అది కాస్త కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తాకడంతో తీవ్ర గాయం అయ్యింది. చైర్మన్ ని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తరలింపు.

దీంతో విపక్షాల తీరును తప్పుబట్టారు హరీష్ రావు. కాంగ్రెస్ సభ్యులు కావాలనే గొడవ చేశారని అన్నారు. అసెంబ్లీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్న హరీష్ రావు. నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హరీష్ రావు అన్నారు. కోమటిరెడ్డి వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్, చర్యలు తీసుకునే అవకాశం.

హెడ్ ఫోన్ తగిలి కౌన్సిల్ ఛైర్మన్ కంటికి గాయం కావడంతో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..ప్రజాప్రతినిధులు అయి ఉండి సభలో గౌరవంగా ఉండాల్సిన నేతలు దాదాగిరి చేస్తారా..? కాంగ్రెస్ కి దమ్మూ, ధైర్యం ఉంటే రేపు మాట్లాడొచ్చు. గొడవ చేసి సస్పెన్షన్ తో తప్పించుకుని పోవాలని ప్లాన్ వేస్తున్నారు. ఇది బిహార్ కాదు..తెలంగాణ అని మరవకిండి.  దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: