ఆ మద్య నేపాల్, కాట్మాండ్ లో భూకంపం ఎంత పెద్ద విషాదాన్ని నింపిందో అంరికీ తెలిసిన విషయమే.  ఇప్పటికీ అక్కడ కొన్ని ప్రదేశాలు వాటికి సాక్ష్యాలుగా ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రాణ, ఆస్థి నష్టం జరిగింది. తాజాగా  ఖాట్మాండు శివారులో కుప్పకూలిన  యూఎస్-బంగ్ల ఎయిర్ లైన్స్ విమానం.  విమానంలో 78 మంది ప్రయాణికులు, 17 మందికి గాయాలు ఆస్పత్రికి తరలింపు. ఈ ప్రమాదంలో 50 మంది మృతి చెందారు. 17 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్. ఎయిర్ పోర్ట్ మూసివేశారు. 

నగరంలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వే పై ల్యాండ్ అయ్యే సమయంలో క్రాష్ అయినట్టు కఠ్మాండూ పోస్ట్ తెలిపింది. వెంటనే అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయని స్థానిక వార్త వెబ్‌సైట్ రిపబ్లికా వెల్లడించింది.


సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో, ఫొటోల ప్రకారం విమానాశ్రయం రన్ వే వద్ద పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడుతున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సహాకయ చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: