ఈ మద్య మహిళలపై ప్రతిరోజు ఎక్కడో అక్కడ లైంగిక వేధింపులు..అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.  ఇలాంటి కామాంధులను ప్రభుత్వం ఎంత కఠినంగా శిక్షిస్తున్నా..ఎక్కడో అక్కడ ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి.    చదువుకునే రోజుల్లో ఓ బాలిక నగ్న చిత్రాలను సేకరించి, ఆపై ఆమెకు పెళ్లయి ఇద్దరు బిడ్డల తల్లయినా కూడా వదిలిపెట్టకుండా అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడిని షీ టీమ్స్ పోలీసులు నిర్భయ చట్టం సాయంతో జైలుకు పంపారు.
Image result for rape images
వివరాల్లోకి వెళితే..   జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన రెడ్డిపోగు రవి నాగర్ కర్నల్ జిల్లా కల్వకుర్తిలో పదో తరగతి చదువుకొన్నాడు.. ఆ సమయంలో అదే పాఠశాలలో చదువుకొన్న విద్యార్థినితో చనువుగా ఉండేందుకు ప్రయత్నించాడు, కాని ఆ విద్యార్థిని నిరాకరించింది. దీంతో ఆమెపై పగను పెంచుకున్న ఆ దుర్మార్గుడు..ఆమె నగ్నచిత్రాలు దొంగచాటుగా సేకరించాడు. వివాహమైన తర్వాత ఆమె ఫోన్‌ నెంబర్‌ను 2017లో సంపాదించి తనతో రోజు మాట్లాడాలని వేధింపులకు గురి చేసేవాడు.
Image result for rape images
ఆమె మాట్లాడకుండా కట్ చేసింది. టెన్త్ చదవే సమయంలో ఆమెకు తెలీకుండా తీసిన నగ్న దృశ్యాలను ఫోన్ కు పంపి, వాటిని భర్తకు కూడా పంపుతానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళనతో ఆమె రవి ఫోన్ నంబర్ ను బ్లాక్ చేయగా, మరో నంబర్ తో వేధింపులు కొనసాగించాడు. అంతటితో ఆగకుండా అతడి ఆగడాలు శృతిమించాయి..తాను తీసిన నగ్న చిత్రాలను భర్తకు పంపుతానని ఆ వివాహితను నిందితుడు బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు. తనకు డబ్బులిస్తే నగ్న చిత్రాలను డిలీట్ చేస్తానని ఆమెకు నమ్మించాడు.
నగ్న చిత్రాలను పంపి వేధింపులు
భర్తకు తెలియకుండా ఆమె రూ.2.50 లక్షలను రవికి ఇచ్చేసింది. అయినా ఫోటోలు డిలీల్ చేయలేదు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని లేకపోతే భర్తను చంపేస్తానని, పిల్లలను కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు. జనవరి 18న ఒక్కసారి తన వద్దకు రావాలని కల్వకుర్తిలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు వస్తే, ఫోటోలన్నీ ఆమె ముందే డిలీట్ చేస్తానని నమ్మబలికితే, ఆమె వెళ్లింది. మాయమాటలు చెప్పిన ఆమెను, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
Image result for jail
రవి వేధింపులు భరించలేక బాధితురాలు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. షీ టీమ్స్ అడిషనల్ డీసీపీ సలీమా, వనస్థలిపురం ఏసీపీ రవీందర్ రెడ్డి నేతృత్వంలో పోలీసుల బృందం రవిని మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుండి సెల్‌ఫోన్, ద్విచక్రవాహన్ని స్వాధీనం చేసుకొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: