ఇప్పుడు ఏపిలో ప్రతిపక్ష అధినేత మంచి దూకుడు మీద ఉన్నారు.  ఇప్పటికే అధికార పార్టీని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.  మొదటి నుంచి ప్రత్యేక  హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్ ఇప్పుడు ఉద్యమాన్ని తీవ్ర తరం చేశాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే నినాదం వినిపిస్తుంది.  మొన్నటి వరకు కేంద్రంపై ఆశలు పెంచుకున్న రాష్ట్ర నాయకులు, ప్రజలు మొన్న అరుణ్ జైట్లీ మీడియా సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడంతో కేంద్రంపై  కట్టలు తెంచుకునే ఆగ్రహంతో ఉన్నారు. 
Image result for ys jagan vemireddy
ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే.  టీడీపీకి చెందిన సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌ రాజ్యసభకు ఎన్నిక కాగా..వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఏకగ్రీవం అయ్యారు. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.  డమ్మిగా ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాగా, ప్రశాంతిరెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. 
AP Rajyasabha battle unanimous - Sakshi
మొత్తానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో మిగతా ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లయింది.  ప్రస్తుతం వైసీపీ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పునరుద్ఘాటించింది. పార్లమెంట్‌లో ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టబోతున్నామని తెలిపిన విషయం తెలిసిందే. 
Image result for jagan chandrababu
తమ ఎంపీలు అన్ని పార్టీల లోక్‌సభ సభ్యుల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారని వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి తాను ఎంతో చేస్తున్నానంటూ అసెంబ్లీలో మొసలికన్నీరు కార్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో మరోసారి ఆలోచనల పడ్డ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు  సీనియర్‌ నాయకులు, అందుబాటులో ఉన్న మం​త్రులతో అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో గురువారం మధ్యాహ్నం మంతనాలు సాగించారు.
Image result for parliament protest ysrcp
రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ మద్దలు ఇచ్చేందుకు సమ్మతం తెలిపినట్లు సమాచారం.  ఏది ఏమైనా వైఎస్ జగన్ పట్టిన పట్టు వీడకుండా ప్రత్యేక హోదా కోసం చేస్తున్న కృషికి ప్రజలు హర్షిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: