రాజకీయ అనుభవం ముదిరితే అధికార దాహం అంతకంతకు పెరిగిపోతుందనేది నేటి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రత్యేకించి తెలుగుదేశం తీరు చూస్తే అర్ధమౌతుంది. శాసనవ్యవస్థకే తీరని కళంకం తెచ్చిన కొందరు రాజకీయ నాయకుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ప్రధములు.


ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుగొమ్మైన ఎన్నికల వ్యవస్థనే అపహస్యం చేస్తూ వస్తున్న తెలుగు  దేశం పార్టీ ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే నైతికంగా రాష్ట్ర పాలనార్హత ను ఏనాడో కోల్పోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు వాటి శాసనసభల్లో ప్రతిపక్షాన్ని తుదకంటా చంపెయ్యాలని చూశాయి. కాని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తాను అన్నంత పని చేసింది.

Image result for Times Now Transmission about TDP Placards in lok sabha

"I request all MPs from Andhra Pradesh to go back to their seats and facilitate the debate because the finance minister has assured that he will address their concerns when he will give reply to the debate on Budget," Parliamentary Affairs Minister said.


22 మంది ప్రజల చేత ఎన్నుకోబడ్ద ప్రతిపక్ష సభ్యులను కొనేసిన తీరు ప్రజాస్వామ్యాన్నే అప హస్యం, పరిహాసం చేస్తూ ప్రజాస్వామ్యం పై వికట అట్టహాసమే చేసింది. ఏ విధంగా ఒక్కో ఎమెల్యేని కొన్నారనే విషయానికి ఉదాహరణ తెలంగాణాలో "స్టీఫెన్సన్ ఎమెల్సి కొనగోలు చేయటానికి ప్రయత్నించి భంగపడ్ద తీరును లైవ్ లో చూశాం కదా!" 


ఇంత రసవత్తర రాజకీయం జనవాహిని ముందే నిస్సిగ్గుగా నడిపినా ఇంకా చంద్రబాబు అసెంబ్లీలో హుందాగా, కూల్‌గా కనపడ్డా, చంద్రబాబు బహిరంగ వేదికపైకి రాగానే చండ్ర నిప్పులు కురిపించారు. మోదీ సర్కార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై నిప్పులు చెరిగారు. కేంద్రం చేస్తున్న రాజకీయంపై మండిపడ్డారు. రెచ్చగొడితే రెచ్చి పోతాం, కానీ చూస్తూ ఊరుకోమని డైరెక్ట్‌ గానే ఎటాక్ చేశారు.

Image result for Times Now Transmission about TDP Placards in lok sabha

40ఏళ్ల అనుభవం ఉన్న తన తోనే ఇలా ప్రవర్తిస్తున్నారంటే, వీళ్లు ఎన్ని నాటకాలు ఆడుతున్నారో గమనించండని ఎన్డీయేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో వాళ్లు మరింత భయపెడతారని. అస్సలు భయపడేది లేదని తెగేసి చెప్పారు. తనను బలహీన పరిస్తే తనను విమర్శిస్తే ఏం లాభమని పవన్ కల్యాణ్‌ ను ధీటుగా సూటి గా ప్రశ్నించారు. విజయవాడలో ఆదరణ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా చంద్ర బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. 


అయితే చంద్రబాబు అనుకున్నంత సులభం కాదు పవన్ కళ్యాణ్! అని తెలుస్తుంది ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ లోని ఇసుక, ఎర్రచందనం, కల్తీ, కాల్-మనీ, సెక్స్-రాకెట్, భూకబ్జా, ప్రార్ధనాలయాల కూల్చివేత, తాత్కాలిక శాసనసభ మరియు సచివాలయాల నిర్మాణం లోని జనానికి తెలియని నిజానిజాల కథాకమామిషు, పోలవరం నిర్మాణ నేపధ్యంలోని లుకలుకలు, రాజధాని భూసేకరణ, అలాగే కొందరు మంత్రులు, ఎంపిలు, ఎమెల్యేలు చేసే అవినీతి చట్ట వ్యతిరేఖ కార్యక్రమాలపై పవన్ చాలా సమా చారం సేకరించినట్లు తెలుస్తుంది.

Image result for Times Now Transmission about TDP Placards in lok sabha

అలాగే వనజాక్షి లాంటి అధికారులపై శాసనసభ్యుల దౌర్జన్యంపై పోలీస్ వ్యవస్థ ప్రవ ర్తించిన తీరు, అలాగే తన కులవర్గానికే చెందిన ప్రొఫెసర్ డా. ఏవివి లక్ష్మి దురా గతాలకు బలైన డా. సంధ్యారాణి దంపతుల మరణంపై జరిగిన దర్యాప్తును జనం ఎవరూ నమ్మ ట్లేదు. వందల సంఖ్యలో విద్యార్దుల మరణాలు సంభవించిన నారాయణ విద్యాసంస్థ లపై ఉదాసీనంగా వ్యవహరించిన తీరు వీటిని ప్రజలు చాలా అభ్యంతరకరంగా భావి స్తున్నారు.


పై విషయాలపైనే కాదు ఓవరాల్ గా పోలీస్ వ్యవస్థ మొత్తం అవినీతి, బందుప్రీతి, నేఱస్థుల పరిరక్షణ, ఉన్నతవర్గాల సేవలోనే తరిస్తున్న తీరు మొత్తం అమరావతి లోని కమ్మేతర కులాలలో పేరుకు పోతున్న వ్యతిరేఖత మొత్తం కూడా పవన్ కు కలసివచ్చే అంశాలు అంటున్నారు. 


అన్నింటిని మించి ఒకప్పుడు పచ్చ మీడియా అంటూ ప్రతిపక్షం మాత్రమే గుర్తించిన తెలుగుదేశానికి మద్దతునిచ్చే మీడియాని ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు - తెలుగు జనావళి గుర్తించిందని బహిరంగంగా తెలుస్తుంది. ఇది నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం నిజాలనే  నిజాలని పార్టీ గగ్గోలు పెట్టినా ఈ పత్రికలు ఇచ్చే సమా చారాన్ని తెలుగుదేశం ప్రచారంగా ప్రజలు విశ్వసించే పరిస్థితులు సమాజంలో నెలకొన్నాయి.

Image result for Times Now Transmission about TDP Placards in lok sabha

నాయనా పులి వచ్చే అన్న సామెత ఏకాయకీ ఋజువు చేసే ప్రభుత్వం మనముందుంది. అంతే కాదు ఎదురు తిరిగిన పవన్ కళ్యాణ్ పై ఆయన గృహ నిర్మాణం కోసం సేకరించు కున్న భూమిపైనే వ్యాఖ్యలు చేస్తున్న ప్రభుత్వ, అధికార పార్టీ వర్గాలు, బ్లాక్ మెయిలింగ్ చెసే ప్రయత్నాలు ప్రారంభించింది తెలుగుదేశ పంచమాంగ దళం.


అందుకే నాలుగేళ్ళుగా కేంద్రంలోని బాజపా తో స్నేహం చేసిన తెదెపా, ఇప్పుడు స్నేహం తెంచేసుకుని బాజపా నుండి బయటపడి "బాజపా రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిందని మొత్తుకున్నా తెదెపాపై ఎలాంటి సానుభూతిని జనం ప్రదర్శించ ట్లేదు"


ప్రత్యేక హోదా విషయాన్ని  తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రజలే తమకు తామే తమ హృదయాంతరాళంలోని కోరిక సాధనకు బహుశ స్వతంత్ర ఉద్యమం సాగించేందుకు సిద్ధం అవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అన్ని ప్రక్కనబెట్టి "ప్రత్యేక రాష్ట్ర ప్రయోజనాల సాధన సమితి” ఆద్వర్యంలో ముందుకు సాగే వాతావరణం నెలకొనవచ్చని అంటున్నారు. అవసరమైతే వైసిపి, జనసేన సహకారం తీసుకునే ఆలోచనల్లో ఉన్నట్లు జన వాతావరణం కనిపిస్తుంది.

Image result for chandrababu in tirumala

నలభైయ్యేళ్ళ అనుభవం అనేది ముప్పైయేళ్ళ ఇండస్ట్రీ అన్న జోక్ లాగా మారి జనం నోటితో కాకుండా వేరేలా నవ్వుకుంటున్నారు.  చంద్రబాబు గారి బహిరంగ ఆగ్రహావేశాల ప్రదర్శన తరవాత జనం ఈ పరిస్థితుల్లో కూడా ఇంత దురాశ ఆవేశం వెళ్లగ్రక్కితే ఎలా బ్రదర్? కూల్!  కూల్! అంటున్నారు.


బై ది బై లోక్-సభలో అవిశ్వాస తీర్మానం పై చర్చ జరగనివ్వని వెల్ లోకి దూసుకు వచ్చిన జనంలో తెరాస, అన్నా డిఎంకే పార్లమెంట్ సభ్యులతో పాటు తెలుగుదేశం ప్లకార్డ్స్ పట్టు కున్న తెదెపా పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నరని “టయింస్ నౌ చానల్”  మార్కింగ్ చేసి చూపించింది. దీని బట్టి తెదెపాకే అవిశ్వాసం నెగ్గాలని లేనట్లుంది అని జాతీయ మీడియా కామెంట్.  


స్పీకర్ కు అడ్డంగా ఉన్న ప్లకార్డును సర్కిల్ చేసి చూపించింది సదరు ఛానెల్. అందులో “వియ్ వాంట్ స్పెషల్ స్టేటస్” అనే డిమాండ్ తో పాటు చంద్రబాబు బొమ్మ కూడా ఉంది. ఈ ఎల్లో ప్లకార్డులు ఎవరు పట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్ప నక్కర్లేదు. ఈ ఒక్క ఘటనతో ప్రత్యేక హోదాపై చంద్రబాబు చిత్త శుద్ధి ఏంటో తెలిసిపోయింది.


జాతీయ స్థాయిలో ప్రసారమైన ఈ చర్చ,  సోషల్ మీడియా ద్వారా అంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చేరింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చంద్రబాబు ద్వంద్వ నీతిని దుయ్యపడుతున్నారు. ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకుంటున్నారు.


ఈ విషయాన్ని ఏమాత్రం రాయని పచ్చ మీడియా బాగోతం ప్రజలు గమనిస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు కుటుంబం తిరుమల సందర్శన ఒక అద్భుత విషయంగా పదేపదే ప్రచారం చేసే పచ్చచానళ్ళు ఇంత ముఖ్యమైన ప్రజలకు అవసరమైన విషయాన్ని వదిలేసింది.   పచ్చపార్టీకి, పచ్చమీడియాకి ఆంధ్రప్రదెశ్ ప్రజలు ఒక్కసారే ఝలక్ ఇవ్వనున్నారా? 


మరింత సమాచారం తెలుసుకోండి: