బీజేపీ నేతల్లో కేవలం ఒక్క నేతనే టీడీపీకీ ముఖ్యంగా బాబుకు గుబులు పుట్టిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో  మోడీ నమ్ముకున్న  అస్త్రం ఈయనేనని పలువురు సైతం అభిప్రాయపడుతున్నారు కూడా. ఆయన ఎవరో కాదు బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో గుజరాత్ ఎలక్షన్ల మీద ఒక టీవీ ఛానెల్లో చర్చ జరుగగా బీజేపి ఎప్పుడూ కూడా టీడీపీ పై ఆధారపడలేదని, పరిస్థితులు ప్రభావితం చేస్తే ఎవరి మద్దతులేకుండా పోటీ చేస్తామని తెలిపిన విషయం విదితమే.


ఇక అప్పటి నుండి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా టీడీపీ పై విమర్శలు చేస్తూనే ఉంటాడు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న సమయంలోనూ ఆయన వారిపై తన విమర్శలను ఆపలేదు. టీడీపీ వారిని తమ గుప్పిట్లో ఉంచడానికే మోడీ రాష్ట్ర కేడర్ తో ఇలా చేయిస్తున్నాడు అన్న వార్తలూ వచ్చాయి. అయితే పొత్తు విడిపోయాక ఆయన మొదటిసారి తన విమర్శలను ఘాటుగానే వదిలారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో శనివారం మీడియాతోమాట్లాడిన ఆయన టీడీపీ పై ధ్వజమెత్తారు.


రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నంతవరకు ఏపీకి ప్రత్యేకహోదా వచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చేసారు. ఏపీకి హోదా ఇవ్వాలని కేంద్రంకు ఉందని అయితే పట్టిసీమ నుండి మొదలుకొని పోలవరం ప్రాజెక్ట్ వరకు కొన్ని లక్షల కోట్ల అవినీతి జరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం నమ్మకం కోల్పోయిందని ఆయన చెప్పారు. చివరికి పాఠశాలల మరుగుదొడ్ల నిధులను కూడా బాబు నేతలు పక్కకు మళ్లించారని అందువల్లనే హోదా ఇవ్వడానికి కేంద్రం జంకుతుందని ఆయన ఘాటువ్యాఖ్యలు చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: