ఓ వైపు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక ఉద్యమం ఊపు అందుకుంది..మరోవైపు రాజకీయ పార్టీలు ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు.  మొన్నటి వరకు బీజేపీతో స్నేహ సంబంధాలు కొనసాగించిన టీడీపీ ఇప్పుడు పోత్తు వీడింది. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా ఇస్తామంటే బీజేపీతో పొత్తుకు సై అంటుంది వైసీపీ.  ఎవరి లక్ష్యాలు ఏవైనా చివరకు ఏపికి ప్రత్యేక హోదా సాధించడమే అంతిమ లక్ష్యం అంటున్నారు. 

అయితే అధికారంలో ఉన్న టీడీపీ గత కొంత కాలంగా ప్యాకేజీల వైపు మొగ్గు చూపిందే కాదే..ప్రత్యేక హోదా వైపు మొగ్గు చూపి ఉంటే ఇప్పటికే తాడో పేడో తేలిపోయేది అని వైసీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనం కోసం కేంద్రంతో వైరం పెట్టుకుంటున్న టీడీపీ మూడు సంవత్సరాల క్రితమే ఈ పని చేసి ఉంటే..ప్రత్యేక హోదా విషయం తేలిపోయేదని అంటుంది.
Image result for ys jagan
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అన్యాయాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ ప్రారంభించారు.  పలు జిల్లాలు పాదయాత్ర చేసిన ఆయకు ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం లభిస్తుంది..రాజన్న మళ్లీ వచ్చాడని ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు.  చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జగన్ కి బ్రహ్మరథం పడుతున్నారు.  ప్రజల స్పందన చూసి వైఎస్ జగన్ ఎంతో ఆనందిస్తున్నారు..ఇప్పటికైనా టీడీపీ కల్లబొల్లి మాటలు నమ్మవద్దని..ప్రజలను రక్షించే వాడే సరైన నాయకుడని అంటున్నారు.
Image result for ap special status
శ్రీరామ నవమి సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ రాముడి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. నేడు యావత్ భారత దేశంలో శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. 

ఈ సందర్భంగా సోమవారం ట్విటర్‌ ద్వారా వైస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలుగు వారందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పారు. ‘మీకు, మీ కుటుంబ సభ్యులకు, శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీ రాముడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: