ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన కుంటుపదింది. ప్రజా పాలన, ప్రజా రక్షణ కంటే రాష్ట్రాధినేతకు రాజకీయాలు, స్వప్రయోజనాలకు సమయం సరిపోవటం లేదు. ప్రతిపక్షం లేని శాసనసభ బహిరంగ సభ లాగా మారింది. దుర్వ్యవస్థకు అడ్డా "ఆంధ్రప్రదేశ్ శాసనసభ" రాజ్యం స్వార్ధపరుల దుర్మధాంధకారుల దుర్వీర భోజ్యంగా మారింది. ఇలా మనం అనుకుంటున్నా, లోకం కోడై కూస్తున్నా సమాజం చీ కొడుతున్నా  అధినేతకు చీమకుట్టినంత ఇబ్బందైనా ఉండటం లేదు.
Image result for sand mafia in AP & rajendra singh
ప్రతి శాసనసభ ఉపన్యాసం ఆత్మస్తుతి పరనిందలతో తరించిపోతుంది. ప్రతి మంత్రి, ప్రతి ప్రజాప్రతినిధి అధినెత మెప్పుకోసం ప్రయత్నించేవారే. ప్రజాఘోష అటు ప్రభుత్వానికి గాని ఇటు అధికారపార్టీకి గాని అసలు ఏమాత్రం పట్టట్లేదు. ప్రజలిచ్చిన ప్రతిపక్ష పార్టీల భాధ్యతను సభాపతి మురుగు లోనే ముంచేశారు. ఇప్పుడు ప్రభుత్వం "ధృతరాష్ట్ర పాలన" నడుపుతోంది. 'దోచుకో దోచుకున్నంత'  అనేలాంటి అవినీతి రాష్ట్రమంతా వ్యాపించిందా. 
Image result for sand mafia in AP & rajendra singh 
ఈ పరిస్థితుల్లో రాష్ట్రమంతా యధేచ్చగా కొనసాగుతున్న ఇసుక మాఫియాపై మొదటిసారి భారత ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు అందింది. అదికూడా రాజకీయ నాయకుడో, ఒక సినీ నటుడో, ఒక ప్రభుత్వ వ్యతిరేకో లేక ఒక ప్రతిపక్ష నాయకుడో ఇచ్చిన ఫిర్యాదు కాదు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, నీటి సంరక్షణ ఉద్యమ కారుడు డాక్టర్ రాజేంద్ర సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఫిర్యాదు చేశారు.
Image result for nippu chandrababu
తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుకమాఫియా రెచ్చిపోతోందని చెప్పటమంటే, ఆపార్టీ సర్వంసహా సార్వభౌముడు, "నిప్పు"  నారా చంద్రబాబుపై ఆరోపణలు చేయటమే.  అధికార టీడీపీ నేతల అండతో ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాఫియా ధారుణంగా రెచ్చిపోతోందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణ, గోదావరి నదుల వద్ద యథేచ్ఛగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు అత్యంత బాహాటంగా జరుపుతున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు.
Image result for sand mafia in AP & rajendra singh
ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ప్రతి దాడులు చేస్తున్నారని తెలిపారు. ప్రశ్నించిన వాళ్ళపై ఆయుధాలతో మాఫియా దాడులు చేస్తున్నట్లు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదన్నారు. ఇసుక మాఫియాతో అన్ని స్థాయిలలోని అధికారులు కుమ్మక్కు అయినట్లు ఆరోపించారు. అక్రమ తవ్వకాలతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని మండిపడ్డారు. టీడీపీనేతల అరాచకాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, అటవీశాఖతో దర్యాప్తు చేయించాలంటూ ఫిర్యాదులో డిమాండ్చేశారు.  
Image result for nippu chandrababu

శాసనసభనే బహిరంగసభ చేసుకొని "ప్రత్యర్ధి లేని యుద్ధక్షేత్రం" లో నిలిచిన యోధాన యోధుడు - బాబు మహా బిజీ 


ప్రభుత్వ మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాన్ గతంలో ఈ విషయం పై పలుమార్లు చెప్పినా సూచించినా, హెచ్చరించినా విమర్శవ్యాఖ్యలు చేసినా రాజకీయంగా చూశారే తప్ప నిర్మాణాత్మక చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించట్లేదు. ప్రభుత్వానికి కనువిప్పు కలగట్లేదు. కాకపోగా ఆయన పై — వ్యాఖ్యలు చేశారంటూ అధికార పార్టీ పంచమాంగ దళాల దాడులు మిన్నంటాయి. 

Image result for sand mafia in AP & rajendra singh

ఇప్పటికైనా చంద్రబాబు అనే నిప్పుపై రామన్ మెగసెసె అవార్డ్ గ్రహీత, ఇకో వారియర్, వాటర్ మాన్ రాజెంద్ర సింగ్ - నీళ్ళు పోశారు. ఇక ఆ అవినీతి నిప్పు చల్లారుతుందేమో చూద్ధాం.

Image result for sand mafia in AP & rajendra singh

మరింత సమాచారం తెలుసుకోండి: