దేశంలో రోజురోజుకీ మోడీ ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికలలో బిజెపి పార్టీ తో కలిసి మిత్రపక్షాలుగా వ్యవహరించిన పార్టీలు కూడా మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా పార్టీలు దూరమైపోయాయి బిజెపికి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా విషయానికొస్తే ఎన్నికల ముందు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు ఇస్తామని చెప్పిన మోడీ...ప్రధాని పీఠం ఎక్కాక రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కారు.

Image result for modi

దీంతో ఆంధ్ర ప్రజలు మోడీ ప్రభుత్వంపై అసహనం చెంది తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ రోడ్డెక్కారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధపడ్డారు. అయితే పార్లమెంటులో ప్రధాని మోదీ  ఏఐఏడీఎంకే ఎంపీల ద్వారా ర‌చ్చ చేసి తీర్మానాన్ని రాకుండా అడ్డుకున్నారు.

Image result for modi

అవిశ్వాస తీర్మానాన్ని అనుమ‌తించి దానిపై చ‌ర్చ‌కు రెడీ అంటే తన పునాదులు క‌దిలిపోతాయ‌ని మోదీ భ‌య‌ప‌డుతున్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.. అప‌ర చాణ‌క్యుడు లాంటి చంద్ర‌బాబు ఇప్ప‌టికే త‌న ఎంపీల‌కు ఏం మాట్లాడాలో ట్రైనింగ్ ఇచ్చేశారు.

Image result for modi

దీంతో చ‌ర్చ జ‌రిగితే టీడీపీ ఎంపీలు దేశం మొత్తం ముందు త‌న‌ను ప్ర‌త్యేక బోనులో నిల‌బెడ‌తారని మోదీకి భ‌యం ప‌ట్టుకుందంటున్నారు. అంతేకాకుండా దేశంలో ఇప్పటికే తనకు వ్యతిరేకంగా గాలి వీస్తుందని ముందే ఊహించినట్టు ఉన్నారు మోడీ ...దీంతో రాబోయే లోక్‌స‌భ ఎన్నికల కోసం మోడీ చాలా భయపడుతున్నారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు

మరింత సమాచారం తెలుసుకోండి: