జగన్ పార్టీలో తాను చేరనే లేదని నటుడు శ్రీహరి స్పష్టం చేసాడు. ఆయన ఈ మద్య జగన్ ను కలవడంతో కాంగ్రెస్ నుంచి జంప్ అయ్యాడని, కూకటిపల్లి నుంచి వైఎస్సార్ సిపి అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో పోటి చేస్థున్నాడని వార్థలు వెలుబడిన విషయం తెలిసిందే.

దీంతో శ్రీహరి మీడియా ముందుకు వచ్చి తాను కాంగ్రెస్ పార్టీని వీడలేదన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. జగన్ ను కలిసిన మాట నిజమేనని అంత మాత్రాన వైఎస్సార్ సిపి చేరాననడం భావ్యం కాదన్నారు. తాను కాంగ్రెస్ నుంచే పోటీ చేస్థానని తెలిపారు.

వైఎస్సార్ సిపి కి రాజీనామా చేసారా.. అని అడిగితే తాను సభ్యత్వమే తీసుకోనప్పుడు ఇంకా రాజీనామా మాటేంటి అన్నారు. తనకు సినిమాల్లో కొనసాగాలని ఉందని చెప్పారు. రాజకీయాల్లోకి రావడం తనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పుకొచ్చారు. దీంతో శ్రీహరిపై కాంగ్రెస్ ఫోర్స్ పడిందన్న వార్థలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: