ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రంగా కేంద్రం అన్యాయం చేయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బిజెపి పార్టీని నమ్మి మోసపోయానని ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో విభజన చట్టంలో ఉన్న హామీలు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మోడీ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ ఎంపీల చేత ఇటీవల పార్లమెంటులో అధినేత చంద్రబాబు ఆందోళనలు నిరసనలు చేపించారు.

Image result for chandrababu

అయితే ఈ క్రమంలో కేంద్రం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో చంద్రబాబు అసహనం చెంది భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టాలని గడ్డి వ్యూహమే పన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ అయ్యి ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని వారి దృష్టికి తేవాలని నిర్ణయించారు.

Related image

చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వస్తేనే మోడీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఏకమయ్యే పనిని వేగవంతం చేయాలని...ఇప్పుడు చంద్రబాబు స్వయంగా ఢిల్లీలో మకాం వేయడానికి బయలుదేరారు. ఈ క్రమంలో ముందుగా దక్షిణాది రాష్ట్రాల పార్టీ నేతలను ఐక్య పరచాలని ఓ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నరట చంద్రబాబు.

Image result for chandrababu

మొత్తం మీద చంద్రబాబు దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని బిజెపి వ్యతిరేక పార్టీ నేతలకు తెలియజేస్తూ ముందుకు సాగాలన్నకొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: