దివంగత నేత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి మొదటి తరం వారసులుగా నందమూరి వంశం నుండి హరికృష్ణ, బాలకృష్ణ లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండూ కలిసి రాకపోవడం దానికి తోడు ఆరోగ్య సమస్యల వల్ల రెండు రంగాల నుండి హరికృష్ణ తప్పుకున్నారు. అయితే సినిమాలు, రాజకీయాలను చక్కగా మేనేజ్ చేసుకుంటూ అటు సినిమాలో స్టార్ హీరోగా, రాజకీయాలలో ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు బాలకృష్ణ.


ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే  బాలకృష్ణ రాజకీయాల నుండి తప్పుకుంటున్నాడు అనే వార్త సామాజిక మాధ్యమాలలో జోరుగా చక్కర్లు కొడుతోంది. వచ్చే ఎన్నికలలో బాలకృష్ణ పోటీ చేయదలుచుకోవడం లేదు అని వార్తలు వస్తున్నాయి. ఇందుకు తగ్గ కారణాలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. 


బయటికి పొక్కిన సమాచారం ప్రకారం రాబోయే ఎన్నికల్లో హిందూపురం నుంచి లోకేష్‌ను పోటీకి దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఎందుకంటే టీడీపీ కి ఇది కంచుకోట కావడం, అంతేగాక ఈ నియోజకవర్గం నుండే ఎన్టీరామారావు పోటీ చేసి గెలుపొందడం వంటి కారణాల చేత లోకేష్ ను ఇక్కడ దింపాలని అనుకుంటున్నాడట. అంతేగాక పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే అలవోకగా విజయం సాధించవచ్చనే ఎత్తుగడతో ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్.


చంద్రబాబు ఇలా డెసిషన్ తీసుకోవడానికి కారణం బాలకృష్ణ తీరు అని ఇంకోవాదన వినపడుతుంది. నిజానికి ఎమ్మెల్యేగా నియమింపబడినప్పటి నుండి నియోజకవర్గంను గాలికి వదిలేసాడని ప్రజల నుండి తీవ్ర ఫిర్యాదులు వెలువడుతున్నాయి. అంతేగాక అసెంబ్లీలో బాలయ్య హాజరు అంతంత మాత్రమే. సినిమాలకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనట్లేదన్న వంటి ఇతరత్రా కారణాల చేత బాబునే స్వయంగా రాజకీయలనుండి తప్పుకోమని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు వట్టి రూమర్ల లేక నిజాలా అన్న వాటిమీద బాలకృష్ణ స్పందించాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: