భారత్ లో మీడియా స్వేచ్చ ఉందనుకోవటం ఒక భ్రమ. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వలను పరిశీలిస్తే మనకు ఒక విషయం బోధపడుతుంది. మీడియా స్వతంత్రంగా జీవించ లేదు. ఏదో ఒక పార్టీకి భజన చేస్తూనే అది బ్రతకాలి. లేకపోతే యాజ్ఞమాన్యాల ఆధిపత్యం ఏదో పార్టీకి తొత్తైతే ఆ పార్టీకి చెక్కభజన చేయటం తప్పదు.  ఉదాహరణకు తెలుగు అత్యంత ప్రథాన మీడియా హౌజెస్ ఈనాడు, ఈ-టీవి చానళ్ళు తమ ఠీవీ ఏనాడో కోల్పోయి. ఇక ఏబిఎన్ సంపూర్ణంగా టిడిపి రంగేసు కున్న పచ్చ పత్రిక. తెలుగుదేశం అధినేత ముద్ధుల పుత్రికే

Image result for national channels stopped transmission of chandrababu interviews

ఇక "సాక్షి" తీసుకుంటే అది వైసిపి ప్రతిబింబం. ఇంకా చానళ్ళు - 85శాతం తెలుగుదేశం “మీడియా మానేజ్మెంట్” కు ఏదో ప్రలోభం ప్రథానంగా కులం, తరవాత పార్టీ, ఆపై ప్రాంతం ప్రాతిపధికగా దాసోహం అనేవే. ఇది రాష్ట్రం లో నేనా అంటే కేంద్రం లోనూ అంతే.  హస్థిన రాజకీయ యాత్రలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర ప్రభుత్వం ధారుణ అవమానాన్ని దాంతోపాటు పెద్ద షాకే ఇచ్చిందని అంటున్నారు. ఇది నిజమా?  అనే వాళ్లకు “అవును” అనే అంటున్నారు. 
Image result for national channels stopped transmission of chandrababu interviews
మూడు రోజుల పాటు నారా చంద్రబాబు నాయుడు హస్థినలోనే మకాం వేసిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టాలన్నది చంద్ర బాబు వ్యూహం. ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదనే చెప్పాలి. అందుకనే మీడియా సమావేశాల ద్వారా తాను చెప్పదలచుకున్నది చెప్పాలనుకున్నారు. అందుకని మీడియా సమావేశాలు నిర్వహించారు. 
Image result for chandrababu in National News channels Interviews
దానివల్ల పెద్దగా ఉపయోగం కనబడలేదు. అందుకని అప్పటికప్పుడు రూటు మార్చుకుని “రెండు జాతీయ చానళ్ళకు చంద్రబాబు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు” ఇచ్చారు.
అయితే, ఇక్కడే చంద్రబాబుకు పెద్ద షాక్ తగిలింది. అదేంటంటే, ఇంటర్వ్యూలు చేసిన రెండు చానళ్ళు కూడా చంద్రబాబు ఇంటర్వ్యూలను ప్రసారం చేయలేదట. 
ఎందుకయ్యా అంటే, చంద్రబాబు ఇంటర్వ్యూలను ప్రసారం చేయవద్దని బిజెపి పెద్దలు ఆయా చానళ్ళ యాజమాన్యాలపై ఆంక్షలు విధించారట. ఎంతకీ తన ఇంటర్వ్యూ లు ప్రసారం కాకపోవటంతో ఆరాతీసిన చంద్రబాబుకు అసలు విషయం తెలిసి షాక్ తిన్నారట.
Image result for chandrababu in National News channels Interviews
అయితే కేంద్రాన్ని ఈ విషయంలో నిగ్గదీసే సామర్ధ్యం కనీసం లో కనీసం కూడా తెలుగు దేశం అహినేత నారా చంద్రబాబు నాయుడుకు లేకుందా పోయింది. టాను సైతం ఏపిలో సాక్షి మీడియాపై అదే బలప్రయోగం చేసిన దాఖలాలున్నాయి కదా! ఆందుకే టిడిపి ఒక వేలు కేంద్రం వైపు చూపితే కేంద్రం నాలుగు వేళ్ళు టిడిపివైపు చూపు తుంది. ఇదీ అసలు కథ.   

Image result for chandrababu in National News channels Interviews

మరింత సమాచారం తెలుసుకోండి: