విద్య, ఉద్యోగ రంగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని సంస్థలు మంగళవారం ‘భారత్‌ బంద్‌’ను నిర్వహించనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాలను హోంశాఖ ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలో సుప్రీం కోర్టు మార్పులు చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 2న దళితులు నిర్వహించిన భారత్‌ బంద్‌ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఆరుగురు దళితులు మృతి చెందినప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. అగ్రవర్ణాల దాడుల నుండి ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పిస్తూ రూపొందించిన చట్టాలలో సుప్రీం కోర్టు పలు మార్పులు చేసింది.
Image result for bharath band
భారత్‌ బంద్‌పై ఒక ప్రముఖ ఛానల్‌ చేసిన దర్యాప్తులో దాదాపు 11 మంది మృతి చెందినట్లు తేలింది. ఘర్షణల్లో భాగంగా దళితుల మృతికి కారణమైన అగ్రవర్ణాలకు చెందిన ముగ్గురు హంతకులు పరారీలో ఉన్నారు. వీరి గురించి సమాచారమందించిన వారికి రూ.10 వేలు రివార్డును పోలీసులు ప్రకటించారు.  నేడు మళ్లీ  భారత్ బందుకు కొన్ని సంస్థలు పిలుపునిచ్చాయి.
Image result for bharath band
ఈ నేపథ్యంల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కాగా, ఏప్రిల్ 10న భారత్ బందుకు పిలుపునిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు, సందేశాలు ప్రత్యక్షమయ్యాయి. కొన్ని గ్రూపులు రిజర్వేషన్ సిస్టంకు వ్యతిరేకంగా భారత్ బందుకు పిలుపునిస్తే, ఈ నెల 2 దళిత సంస్థల భారత్ బంద్ హింసాత్మకంగా మారడాన్ని వ్యతిరేకిస్తూ మరికొన్ని సంస్థలు బందుకు పిలుపునిచ్చాయి.
Image result for bharat band
ఈ నేపథ్యంల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.ఎక్కడైనా శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే ఆ ప్రాంతానికి చెందిన కలెక్టర్, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: