విమాన ప్రమాదాలు ఎప్పులు ఎలా ముంచుకు వస్తాయో అస్సలు తెలియదు. ముఖ్యంగా మిలటరీ విమానాలు కొన్ని సాంకేతిక లోపాల వల్ల ప్రమాదాలకు గురి అవుతుంటాయి..ఆ సమయంలో విమానంలో పైలెట్ ఒక్కరూ ఇద్దరు ఉండటం సహజం. తాజాగా అల్జీరియాకు చెందిన మిలటరీ విమానం కుప్పకూలిన ఘటనలో 105 మంది చనిపోయారని అంచనా వేస్తున్నారు.
Image result for aljeeriya plane crash
ఈ ప్రమాదం అల్జీరియా రాజధాని అల్జీర్స్ కు సమీపంలో ఉన్న బౌఫారిక్ ఎయిర్ పోర్టు వద్ద ఈ రోజు సంభవించింది. అయితే ఈ ప్రమాదం విషయంలో పూర్తి స్థాయి సమాచారం లేనప్పటికీ పెద్ద సంఖ్యలో మిలిటరీ సిబ్బంది మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం సమయంలో  విమానంలో 200 మందికిపైగా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
Image result for aljeeriya plane crash
ఈ ప్రమాదం జరిగిన వెంటనే 14 అంబులెన్స్‌లు హుటా హుటిన అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న అన్ని రోడ్లను మూసేశారు. అల్జీరియా పశ్చిమ ప్రాంతంలో ఉండే బిచార్ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానిక టీవీ ఫుటేజీలో పెద్ద ఎత్తున నల్లటి పొగ కనిపిస్తోంది. విమానం క్రాష్ అయిన ప్రదేశంలో పెద్ద ఎత్తున సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. పక్కనే ఉన్న ఆలివ్ చెట్ల మీద విమానం తోక భాగం కనిపిస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: