Image result for cji first among equals
ధర్మాసనాలు ఏర్పాటు, కేసులు కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి సర్వహక్కులూ ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి "సమానుల్లో ప్రథములు - ఫష్ట్ ఏమాంగ్ ఈక్వల్స్" అంటూ స్పష్టంగా తెలిపింది. కేసులు కేటాయింపు, పారదర్శంగా ఉండేలా మార్గ దర్శకాలు రూపొందించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ దీపక్‌ మిశ్రా, జస్టిస్ ఏ ఎం ఖన్వీకర్, జస్టిస్ డి వై చంద్రచూడ్‌ తో కూడిన ధర్మాసనం బుధవారం విచారించి ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 
Image result for cji first among equals
కేసులు కేటాయింపు, ధర్మాసనాలు ఏర్పాటు చేసే విషయంలో ప్రధాన న్యాయమూర్తి కే సర్వ హక్కులూ ఉన్నాయని జస్టిస్ చంద్రచూడ్ లిఖిత పూర్వకంగా తీర్పును వెలువరించారు. పిటిషన్ భారత ప్రధాన న్యాయ మూర్తి కి అప్రదిష్ట తెచ్చేవిధంగా ఉందని భావించిన ధర్మాసనం దాన్ని నిర్ద్వంధంగా కొట్టివేసింది. 
Image result for supreme court of india justices chelameswar, ranjan gogoi, madan b lokur

జనవరి 12న దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ బీ లోకూర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భారత ప్రధాన న్యాయ మూర్తి పై తీవ్రమైన ప్రతిష్ఠకు భంగకరమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లోనే అశోక్ పాండే అనే వ్యక్తి ఈ విషయంలో సరైన వివరణ యివ్వాలని సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. దానిపై విచారించిన భారత ప్రధాన న్యయమూర్తితో కలిపి ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తమ తీర్పు వెలువరించింది.  

Image result for supreme court of india justices chelameswar, ranjan gogoi, madan b lokur

మరింత సమాచారం తెలుసుకోండి: