పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ ఈనెల 12 న ప్రధాని మోడీ తన ఎంపీలతో కలిసి పార్లమెంటు ఆవరణలో ఒకరోజు ఉపవాస దీక్షకు కూర్చున్న సంగతి తెలిసిందే. భారతదేశ చరిత్రలో ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇలా దీక్ష చేయడం మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు భావించారు.


అయితే అప్పుడు ఈ దీక్షపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మోడీ చేపడుతున్న దీక్ష దేని కోసం? ప్రజలను మోసం చేయడానికా? అది సాధ్యం కాదు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. కాగా ఇప్పుడు చంద్రబాబే తన పుట్టిన రోజున దీక్షకు దిగబోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. ప్రత్యేకహోదా డిమాండ్‌తోబాబు ఒక రోజు దీక్షకు దిగబోతున్న సంగతి తెలిసిందే.


కాగా ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న ప్రతిపక్ష నాయకుడు జగన్, ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక సవాల్ ను విసిరాడు. ఒక రోజంటూ దొంగ దీక్షలకు  కూర్చోవడం కాదు, దమ్ముంటే టీడీపీ ఎంపీల చేత రాజీనామాలు చేయించాలని జగన్, బాబుకు సవాల్ విసిరాడు. కొంగ జపాలు చేయడం కాదు, పనికొచ్చే పనులు చేయాలని జగన్, చంద్రబాబుకు సూచించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: