విజయమే ప్రధానంగా నడిచే బాజపా రాజకీయం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రసవత్తర వ్యూహాలముందు చిత్తైపోతుంది. చివరకు ఆయన రాష్ట్రంలో కొత్త మతాన్ని  సృష్టించటానికి కూడా వెనకాడలేదు. ఆయన ఆడేనాటకాలతో కర్ణాటక ఎన్నికల రాజకీయ రణక్షేత్రం వేడెక్కింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని అధికార పక్షం తెలుగు వారి ప్రభావ కర్ణాటక ప్రాంతాల్లో బాజపా వ్యతిరెఖ ప్రచారానికి రంగం సిద్ధం చేసింది.
Image result for karnataka elections & RSS entry
జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాన్ కాంగ్రేస్ నాయకుడు చిరంజీవి కూడా బాజపాకు వ్యతిరెఖంగా ప్రచారం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు బాజపా ఒకవైపు మిగిలిన పార్టీలన్నీ కాంగ్రెస్, జెడిఎస్ వైపు రణరంగాన్ని నిట్టనిలువునా చీల్చి త్రిముఖ వ్యూహా యుద్ధానికి సిద్దమయ్యాయి. 'కాంగ్రెస్ ముక్త భారత్' మోడీ లక్ష్యం. కర్ణాటకలో బిజెపిని అంతమొందించటం సిద్ధరామయ్య లక్ష్యం. రాజీవ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా పట్టం కట్టిన తరవాత కాంగ్రెస్ గెలుపు అత్యంత ముఖ్యం. జెడిఎస్ తన ప్రాముఖ్యం నిలుపుకొని కుమారస్వామి కీలకపాత్ర వహించటమో, కాలం కలిసొస్తే ముఖ్యమంత్రి కావాలనే ఆశయం తండ్రి మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ మనసులో మాట. 
Image result for karnataka elections & RSS entry
ఇన్ని ఆశలు ఆశయాలు ప్రాధమ్యాలుగా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దాని అధిష్ఠానం అన్ని కోణాలలోనూ ప్రత్యేక వ్యూహాలతో తన పట్టు బిగిస్తూవస్తుంది. దీనికోసం కర్ణాటక ఎన్నికల వ్యూహాలకై ఆరెస్సెస్‌ రంగంలోకి దిగింది. బీజేపీకి అనుబంధంగా దశాబ్దాలుగా ఆరెస్సెస్‌ పనిచేస్తున్నా ప్రత్యక్ష రాజక్రీయాల్లోకి వ్యూహలు రచించి గెలుపు సాధించటానికి పనిచేయటం ఇదే తొలిసారి. 
Image result for karnataka elections & RSS entry
అభ్యర్థుల ప్రచారం, స్థానికంగా కీలక ఎన్నికల నిర్ణయాలను ఆరెస్సెస్‌ కార్యకర్తలే పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఇందుకోసం 50వేల మంది ఆరెస్సెస్‌ కార్యకర్తలు రంగం లోకి దిగనున్నారు. బాజపాకి సరైన మార్గనిర్దేశనంతో పాటు బీజేపీ నాయకులను బూత్‌ స్థాయి నుంచి పని చేసేందుకు ఎటువంటి విది విధానాలు అమలు చేయాలన్నది వీరే నిర్ణయించబోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక ఆరెస్సెస్‌ ప్రముఖులు డాక్టర్‌ ప్రభాకరభట్‌ సమీప సారథ్యంలో వీరి పర్యవేక్షణ క్షుణ్ణంగా సాగనుంది.
Image result for karnataka elections & RSS entry 
త్రిపుర రాష్ట్రంలో ఆరెస్సెస్, సంఘ్‌ పరివార్‌ ద్వారానే మానిక్‌ షా ప్రభుత్వాన్ని వ్యూహాత్మకంగా కూల్చేందుకు పన్నిన ప్రత్యేక విజయవంతమైన వ్యూహాలను కర్ణాటకలోనూ అమలు చేయదలిచారు. విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌ దళ్‌, హిందూ జాగృతి వేదిక, కిసాన్‌ సంఘ్‌, సహకార భారతితో పాటు బీఎంఎస్‌ దాని అనుబంధ సంఘాల ప్రతినిధులు, స్థానిక బీజేపీ కార్యకర్తలతో కలసి క్షెత్రం నుండే పనిచేయనున్నారు.
Image result for karnataka elections & RSS entry
ప్రతి జిల్లా పంచాయతీ లోను  3నుంచి 4బూత్‌లకు "శక్తి కేంద్రం" గా పిలవబడే అనుసంధాన కమిటీలు వేస్తున్నారు. కాగా ఓటరు జాబితా లో ప్రతి పేజీని "పేజ్‌ ప్రముఖ్‌" లు క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఓటరును ప్రామాణికంగా తీసుకొని వారి, వద్దకు వెళ్ళి బీజేపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలి, బాజపా ద్వారా దేశానికి జరుగుతున్న అభివృద్ధి వంటి అంశాలపై వివరించనున్నారు. మరో ప్రక్క సోషల్‌ మీడియా లోనూ వ్యూహాత్మక ప్రచారం ముమ్మరం చేయదలిచారు.

Image result for karnataka elections & RSS entry

మరింత సమాచారం తెలుసుకోండి: