జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న మొన్నటివరకూ టీడీపీతో అంటకాగిన సంగతి తెలిసిందే. మోడీ, బాబుల ఉమ్మడి స్నేహితుడుగా అందలాలు అందుకున్నాడు. పవన్ ఏం చేబితే అది వెంటనే చేసేసింది టీడీపీ ప్రభుత్వం.. ఆ క్రెడిట్ అంతా పవన్ ఖాతాలోకి వెళ్లింది. ఈ సందర్భంలో అప్పట్లో పవన్ కల్యాణ్ వైసీపీకి కూడా శత్రువుగా కనిపించాడు. 

pawan vs roja కోసం చిత్ర ఫలితం

అందుకే పవన్ కల్యాణ్ ను వైసీపీ నేతలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. అలాంటి వారిలో సినీనటి, ఎమ్మెల్యే రోజా ముందుండేది కూడా. అయితే ఇప్పుడు సీన్ అంతా తారుమారు అయినట్టుంది. పవన్ కల్యాణ్ టీడీపీపై యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ ధోరణి కూడా మారినట్టుంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు పవన్ కల్యాణ్ కొత్త శత్రువు, ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ. 

pawan vs roja కోసం చిత్ర ఫలితం

ఆదివారం నాటి సంపాదకీయంలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జనసేన అధినేతగా పవన్‌ కల్యాణ్‌ కార్యక్రమాలకు విశేష ప్రచారం కల్పించిన మీడియా సంస్థలు ఇప్పుడు ఆయనకు చేదుగా మారాయంటున్నారాయన. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వార్తలు ప్రచురించిన, ప్రసారంచేసిన సంస్థలు ఇప్పుడు తీయగా మారడం వెనుక మర్మం ఏమిటో తెలియాల్సి ఉందంటున్నారు. 


మొన్నటివరకు పవన్‌ కల్యాణ్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు శ్రీమతి రోజా నిన్నటి నుంచి మా పవన్‌ కల్యాణ్‌ అని సంబోధించడం వెనుక మతలబు ఏమిటో తెలియదని ఆర్కే రాసుకొచ్చారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో చోటుచేసుకోబోయే మార్పులకు ఈ పరిణా మాలన్నీ నాందిగా కనిపిస్తున్నాయని ఆర్కే అభిప్రాయపడ్డారు. మరి నిజంగానే పవన్, రోజా మధ్య కానీ పవన్, జగన్ మధ్య కానీ అవగాహన కుదిరిందా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: