తనను టార్గెట్ చేశాయంటూ పవన్ కల్యాణ్ కొన్ని మీడియా సంస్థలపై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏబీఎన్ వాహనంపై దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్టు ఆవేదన పేరుతో ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో మీరూ చూడండి.. 

telugu journalist కోసం చిత్ర ఫలితం

జర్నలిస్టు సంఘాలు ఎవరి కొసం మీ ఆరాటం?

మీడియా యాజమన్యాలు పరువు నష్టం దావాలు వేస్తున్నాయి కదా. ..మరి జర్నలిస్టుల లు ఎందుకు రోడ్లు ఎక్కటం.. .?
జర్నలిస్టుల కో రూలు....పవన్ కళ్యాణ్ కు మరో రూలా. ..?  జర్నలిస్టుల ను పవన్ కళ్యాణ్ తిట్టారా....? 
జీతాలు ఇవ్వకుండా... ఏత ప్పు చేయకపోయినా , అకారణంగా ఉద్యోగాల నుంచి ఊడపెరికిన యాజమాన్యాల విషయంలో ఈ సంఘాలు బాధితులకు యేం న్యాయం చేశాయి. ..?
జర్నలిస్టుల ఉనికికి యేం అభద్రత వచ్చిందని...ఉలికి పాటు.. ఎవరి కోసం ఈ ఆరాటం.. ఎవరి కింద చెంచాగిరికి ఈ ప్రయత్నం..
ఎలక్ట్రానిక్ మీడియాలో సంస్కరణలకు నడుంకట్టకుండా గులాంగిరి ఎందుకు???
పక్కవాడి జీవితంలోకి తొంగిచూడటమే జర్నలిజమా???
వ్యక్తిగతాలను రోడెక్కించడమే మీ అభిమతమా
మీడియా పై విమర్శ వచ్చినప్పుడు ఆత్మపరిశీలన చేసుకోరా?? 
ఆ మూడు ఛానెళ్లు ఆ రెండు పేపర్లే మీడియానా?? 
సంపన్న మీడియా తొత్తులా జర్నలిస్టు సంఘాలు.

telugu journalist కోసం చిత్ర ఫలితం
వేయండి ఎలక్ట్రానిక్ మీడియా పై కమిటీని.. పెట్టండి చర్చ... మనల్ని మనమే సరిదిద్దుకుందాం!!
👉దుర్గ గుడిలో క్షుద్ర పూజలు
👉ఆయేషా హత్య
👉గరగపర్రులో వెలి
👉పోలవరం ఆర్&ఆర్ ప్యాకేజిలో అవినీతి
👉ఆసిఫా
👉 భూకబ్జాలు
👉 కాగ్ రిపోర్టు 
👉మహిళా అధికారుల పై దాడులు
👉పార్టీ జంపింగ్లు
👉ఓటుకు నోటు
👉ప్రత్యేక హోదా 
👉 రాహుల్ మరణం
👉మంధని మధుకర్
👉 మాయమౌతున్న దేవుడి మాన్యాలు 
👉వెంకట్ రాహుల్ బంగారు పతకం తెచ్చినా నో న్యూస్???
వీటి పై చర్చలు ఉండవా??? భయమా???

journalist కోసం చిత్ర ఫలితం

మీడియా ఛానల్స్ అకాశం నుండి ఉడిపడలేదని గమనించాలి...
రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే హక్కు ఎవరికి లేదు.
మనం నిత్యం ఆధారాలు ఊహజనిత వార్తలు ఎన్నో వేస్తాం.
ఎంతో మంది మన వార్తల వల్ల మానసిక వ్యధ ను అనుభవించారు.
ఎన్నో కుటుంబాలు మీడియా చేసిన రచ్చ కు తల ఎత్తుకోలేక  బయటకు రాలేని  పరిస్థితి లో ఉన్నారు.
అలాంటి వార్తల నిత్యం వేసే మన పేరు ఒక్కసారి తలిస్తేనే  మనం గిలిగిల కొట్టుకోవడం ఎందుకు.
మనం ఎన్నో ఆరోపణలు, విమర్శలు పేరుతో వార్తలు వేస్తాం.
అలాంటి విమర్శలు , ఆరోపణలను మనం ఎందుకు స్వీకరించలేకపోతున్నాం.
టీవి 9 రవి ప్రకాష్ ను ఓ జర్నలిస్టు మిత్రుడు చెప్ప తో కోడి తే అది మీడియా దాడి గా ఈ జర్నలిస్ట్ సంఘాలకు కనిపించలేదా .
ఏబిన్ వాహనాలపై దాడి చేస్తేనే  మీడియా పై దాడినా.
సాక్షి చానల్ ప్రతినిధులపై ఎన్నో చోట్ల దాడికి పాల్పడ్డారు.
అప్పుడు ఏం చేశాయి ఈ సంఘాలు.

tdp ban on ntv కోసం చిత్ర ఫలితం

ఏపిలో ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు వేశారని N tv ని ఆపివేస్తే  ఏం చేశాయి ...ఈ సంఘాలు ....
కేవలం టిడిపి అనుబంద మీడియా ఏబిఎన్ పై దాడే  మీడియా పై దాడా  ?
ఏనాడైనా జర్నలిస్టు లు యాజమాన్యం వల్ల పడుతున్న ఇబ్బందులు గురించి ఒక్క జర్నలిస్టు సంఘం అయినా పోరాటాలు , నిరసనలు తెలియజేశాయా ?
ఎవరి కోసం జర్నలిస్టు సంఘాలు పని చేస్తున్నాయే  అర్దం  అవుతుందా ?
యాజమాన్యాల కోసమా  ? చాలిచాలని  జీతాలతో  గోడ్డు  చాకిరీ చేసే జర్నలిస్టు ల కోసమా  ?
ఒక్కసారి అన్ని సంఘాలు ఆత్మపరిశీలన  చేసుకుంటారని  ఆశీస్తున్న ....
-ఓ జర్నలిస్టు ఆవేదన
------------------------
#justasking


మరింత సమాచారం తెలుసుకోండి: