తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని సచివాలయం డి బ్లాక్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తార‌ని విద్యాశాఖ అధికారులు ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు.  పలు వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను విద్యార్థులు తెలుసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు అధికారులు తెలిపారు. www.bse.telangana.gov.in, cgg.gov.in వెబ్‌సైట్లలో ఫలితాలు చూడొచ్చు.
ఏప్రిల్ 27న 10th పరీక్ష ఫలితాలు
ఫలితాలను మార్కులు కాకుండా గ్రేడింగ్‌లో మాత్రమే విడుదల చేయనున్నారు.  ఈసారి తెలంగాణ విద్యాశాఖ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించింది. మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టాలనే ఉద్దేశంతో పరీక్ష రాసే సమయంలో విద్యార్ధి వాష్ రూంకి కూడా వెళ్లకూడదని నిబంధన కూడా పెట్టింది.
Image result for 10th class students
అవసరమైతే అతని వెంట ఎస్కార్ట్ కూడా వెళ్ళేలా అన్ని పరీక్షా కేంద్రాలకు సూచించారట. మార్చి 15 నుండి ఏప్రిల్ 2వరకు నిర్వహించిన పదవ తరగతి పరీక్షలకు  సుమారు 8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఫలితాల తేదీ ప్రకటించడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: