మైనారిటీ కూడా తీరని ఓ బాలుడు సెక్స్ సైకోగా మారిన వైనం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది. నిర్భయ తరహా ఉదంతంపై ఏకంగా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. గుంటూరు జిల్లా ఒప్పిచర్లలో జరిగిన ఈ దారుణంపై సీఎం స్పందించారు. మహిళలపై నేరాలకు పాల్ప డే వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 

sex psycho కోసం చిత్ర ఫలితం

గుంటూరుజిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో వివాహితపై అత్యాచారం, దాడి ఘటనలపై బుధవారం తన నివాసం వద్ద ఉన్న గ్రీవెన్స్‌ కార్యాలయంలో పోలీస్‌ ఉన్నతాధికాలతో ఈ ఘటనపై చర్చించారు. మంగళవారమే ఫిర్యాదు అందిందని, బుధవారం నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు సీఎంకు వివరించారు. అలాంటివారిని ఏమాత్రం ఉపేక్షించవద్దని సీఎం గట్టిగా చెప్పారు. 

sex psycho కోసం చిత్ర ఫలితం
అసలేంజరిగిందంటే.. గుంటూరు జిల్లా ఒప్పిచర్లలో పదేళ్ల క్రితం బాధిత మహిళకు వివాహమయింది. ఒక బిడ్డ పుట్టిన తరువాత ఆమె భర్త, వారిని వదిలేసి వెళ్లిపోయాడు. ఆమె ఇంటికి సమీపంలోనే 17 ఏళ్ల బాలుడి ఇల్లుంది. తండ్రి వేరే పెళ్లి చేసుకుని గ్రామంలోనే వేరే మహిళతో కలిసి ఉంటున్నాడు. పెద్దల కట్టడి లేకపోవడంతో ఆ బాలుడు చెలరేగిపోయాడు. 


తన ఇంటికి దగ్గరలోనే ఉన్న వివాహిత వద్దకు సోమవారం రాత్రి వెళ్లాడు. తన కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టాడు. నోట్లో గుడ్డలు కుక్కి రాత్రంతా ఆమెను లైంగిక వేధించాడు. ఆమె సున్నిత భాగాలపై కర్రతో కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై ఆమె స్పృహతప్పి పడిపోయింది. తెల్లారి బాధితురాలిని అపస్మారక స్థితిలో చూసిన గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: