ఆరోపణలు – ప్రత్యారోపణలో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. బీజేపీ డైరెక్షన్ లో జగన్, జనసేనాని కుట్ర పన్నుతున్నారంటూ తెలుగుదేశం నేతలు తమ ఆరోపణలను తీవ్రతరం చేశారు. పొలిటికల్ ఆరోపణలకు కాస్త ..  మషాలా జోడిస్తూ.. సినిమాటిక్ గానూ ఆరోపణలు చేస్తూ రక్తికట్టిస్తున్నారు తమ్ముళ్లు. తాజాగా.. ఈ వివాదాన్ని ఓ మల్టీస్టారర్ సినిమాతో పోలుస్తూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. అటు జనసేన, జగన్ సేన కూడా అదే రేంజ్ లో సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తుండడడంతో పొలిటికల్ సెటైర్లు బాంబుల్లా పేలుతున్నాయి.

Image result for jayadev galla

రీసెంట్ గా మహేష్ బాబు హీరోగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమా చూసాం.. త్వరలోనే అసలు సిసలు మల్టీస్టారర్ పొలిటికల్ సినిమా రానుందంటున్నారు మహేష్ బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ఇంతకీ ఆ సినిమాలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎవరనేగా మీ సందేహం.. వాళ్లు కూడా పొలిటీషియన్సే.. ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ  సినిమాలో హీరోలైతే.. వైసీపీ రాజకీయ సలహాదారు ప్రశాంతి కిషోర్ డైరెక్ట్ చేస్తారట.. ఇక ఈ పొలిటికల్ సినిమా మోదీ, అమిత్ ప్రొడక్షన్స్ నుంచి రాబోతుందంటూ గల్లా జయదేవ్ వేసిన సెటైర్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 

Image result for jagan pawan

తెలుగుదేశం ప్రభుత్వంపైనా, తెలుగుదేశం పార్టీపైనా మోదీ, అమిత్ షా లు... జగన్, పవన్ లతో కలిసి కుట్రచేస్తున్నాయని తెలుగుదేశం కొంతకాలంగా ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలనే సినిమాటిక్ గా చెప్పారు గల్లా జయదేవ్.. ఈ ఆరోపణల వెనుక బలమైన కారణాలను కూడా విశ్లేషిస్తోంది తెలుగుదేశం.. Jagan పార్టీని, జనసేన పార్టీలను J బ్యాచ్ గా అభివర్ణిస్తున్న తమ్ముళ్లు.. ఈ ఇద్దరూ మోదీ, షా డైరెక్షన్ లో టీడీపీపై కుట్ర చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

Image result for jagan pawan

30న తిరుపతిలో టీడీపీ తలపెట్టిన మోడీ వ్యతిరేక సభన దెబ్బకొట్టేందుకే.. అందరి దృష్టిని మరల్చేందుకు మళ్లించి బీజేపీని కాపాడేందుకు పవన్ చిత్తూరులో పర్యటించబోతుంటే.. అదే రోజు చంద్రబాబుకు వ్యతిరేకంగా విశాఖలో జగన్ సభ పెట్టారని అని ఇది కాదా ద్రోహం అంటూ సోషల్ మీడియాలో టీడీపీ అనుబంధం సభ్యులు, నెటిజన్లు ప్చారాన్న వైరల్ చేస్తున్నారు. అంతేకాదు మొన్నటి చంద్రబాబు దీక్షను కవర్ కానియకుండానే పవన్ మీడియా వార్ మొదలుపెట్టారని ఆరోపిస్తున్నారు. అయితే ఇదంతా తెలుగుదేశం కట్టు కధ అంటూ కొట్టిపారేస్తున్నారు  బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల నేతలు.. తెలుగుదేశం  అసలు సమస్యలను పక్కతోవ పట్టించేందుకే రాజకీయ డ్రామాలాడుతోందని విమర్శిస్తున్నారు ఆపార్టీ నేతలు. నాలుగేళ్లుగా అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు.. ఇప్పుడు సినిమాలు చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

Image result for ramdas athawale

అటు బీజేపీలో జగన్ దోస్తీ కట్టడం ఖాయమంటూ తెలుగుదేశం చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో  కేంద్రమంత్రి  రాందాస్ అథువాలే వైసీపీని ఎన్డీయేలో ఆహ్వానిస్తున్నామంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ .. కేంద్రంలో చేరాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత కన్నా..ఎన్నికలకు ముందే ఎన్డీయేతో చేరితో బీజేపీ, వైసీపీ కాంబినేషన్ లో మంచి ఫలితాలు రాబట్టొచ్చంటూ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బీజేపీతో కలిసి వైసీపీ కుట్ర చేస్తుందని పదేపదే తెలుగుదేశం చేస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్రమంత్రి ఇచ్చిన ఆఫర్ పై వైసీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.. మొత్తం మీద రాష్ర్టంలో ప్రత్యేకహోదా చుట్టూ తిరుగుతున్న ఈ పొలిటికల్ మల్టీస్టారర్ మూవీ  ఎన్ని కోట్లు కలెక్షన్లు.. అదేనండి ఎన్ని ఓట్లను తెచ్చిపెడుతుందో వేచిచూడాలి..

 


మరింత సమాచారం తెలుసుకోండి: