తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు కొద్ది సేపటి క్రితమే విడుదలయ్యాయి.    సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ, మొత్తం 2125 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయని, ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 83.78 గా నమోదైందని, బాలికలు పైచేయి సాధించారని చెప్పారు. మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా 11,103 పాఠశాలలకు చెందిన 5,38,867 మంది హాజరయ్యారు.

ఇందులో బాలురు 2,76,388 మంది కాగా.. బాలికలు 2,62,479 మంది ఉన్నారు. బాలికల ఉత్తీర్ణత శాతం 85.14  కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 82.46 శాతంగా ఉందని అన్నారు. టెన్త్ ఫలితాల్లో మొదటి స్థానంలో జగిత్యాల,  చివరి స్థానంలో ఆదిలాబాద్ నిలిచాయి.  2125 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి వెల్లడించారు.   
Image result for తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షలను మొత్తం 5,34,726 విద్యార్థులు రాశారు.  కాగా,  ప్రైవేట్ పాఠశాలల కన్నా రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు మెరుగైన ఫలితాలు సాధించాయి. 21 ప్రభుత్వ పాఠశాలల్లో సున్న శాతం ఉత్తీర్ణత లభించడం గమనార్హం.  జూన్ 4 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: