అంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేడు ఆదివారం రోజున ఒక ప్రత్యేక కార్యక్రమ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రతిపక్షనేత జగన్ పైన, ఆ పార్టీనాయకులపైన మరియు బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. జగన్ కు హైదరాబాదుపై ఉన్న ప్రేమ పులివెందులపై లేదంటూ విమర్శించాడు. జగన్ ఒకసారి పులివెందులకు వెళ్ళి ప్రభుత్వం ఇచ్చిన నీళ్లను చూసైనా జ్ఞానం తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు.


ఆయన ఇంకా మాట్లాడుతూ-  కమలం నీళ్లు చల్లుకోవడానికి ఉన్న శ్రద్ధ పులివెందుల ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఆ నీళ్ళను కూడా చూడటానికి జగన్ వెళ్ళలేదంటే, పులివెందుల ప్రజలపై జగన్ ప్రేమ, అభిమానం తెలిసిపోతుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలలో పోటీచేయడానికి బయటిజిల్లాల్లో జగన్ సేఫ్ ప్లేస్ కోసం వెతుకుతున్నట్లు తనను కలవడానికి వచ్చిన పులివెందుల ప్రజలే తెలిపారని ఆయన చెప్పుకొచ్చాడు.


కృష్ణా జలాలు పులివెందులకు వచ్చిన తరువాత వచ్చే ఎన్నికలలో జగన్ పులివెందుల నుండి ప్రాతినిథ్యం వహించడని వైసిపి వాళ్ళే చెప్పినట్లు ఆయన తెలిపాడు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీలో కనిపించకుండా కర్నాటకలో బిజెపి గెలవడం కోసం ప్రయత్నిస్తున్నాడని విమర్శలు గుప్పించారు. కర్నాటకలో బిజెపికి  మద్దతివ్వడం తెలుగుజాతికి ద్రోహం చేయడమే అని ఆయన వాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: