రాజకీయాలలో చాలా విషయాలు ఓపెన్ సీక్రెట్స్ గా కనపడుతూనే చాల కన్ఫ్యూజింగ్ గా ఒక పజిల్ గేమ్ ను తలపిస్తూ అనేక రహస్యాలకు కేంద్రంగా మారుతూ ఉంటాయి. అందువల్లనే అతి సామాన్యుడు దగ్గర నుంచి అసామాన్యుడు వరకు ఏదో ఒక సందర్భంలో రాజకీయాల గురించి మాట్లాడుతూనే ఉంటారు. 
PAVAN LATEST POLITICAL MEETING PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి పరిస్థుతులలో ప్రశ్నిస్తాను అంటూ రాజకీయాలలోకి వచ్చి ప్రస్తుతం ఎవరికీ అర్ధం కాని వ్యూహాలు రచిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయ సలహా దారుడుగా లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన దేవ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజుల కిందట ‘జనసేన’ పార్టీ అధినేత పవన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన రాజకీయ వ్యూహకర్త అంటూ దేవ్ ను పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.
సంబంధిత చిత్రం
దీనితో ఈ దేవ్ ఎవరు అంటూ విపరీతమైన శోధన గూగుల్ సర్చ్ లో జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈపేరు మీద గూగుల్ లో వెతికిన వారికి 74వేలకు పైగా రిజల్డ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ దేవ్ అసలు పేరు వాసుదేవ్ అని అందరికీ తెలియడం ఇష్టం లేని ఉద్దేశ్యంతో   తన పేరును దేవ్ గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈదేవ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి మాత్రమే కాకుండా ఒకప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దామోదర్ రాజనర్సింహా సతీమణికి వరసకు సోదరుడు ఈ దేవ్ అన్న గాసిప్పులు కూడ హడావిడి చేస్తున్నాయి. 

PAVAN LATEST POLITICAL MEETING PHOTOS కోసం చిత్ర ఫలితం

వీటన్నింటికీ మించి దేవ్ గతంలో భారతీయ జనతా పార్టీలో పనిచేసి మోడీకి అతి సన్నిహితంగా వ్యవహరించే ఒక గ్రూప్ తో ఈ దేవ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు టాక్. చెన్నైలో ఈ దేవ్ కు ఒక సొంత ఐటీ కంపెనీ ఉన్నట్లు ఆకంపెనీలో అనేక వందలమంది పనిచేస్తున్నట్లు వార్తలు కూడ ఉన్నాయి.  రాజకీయ సర్వేలు నిర్వహించడం ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల బలాబలాల్ని విశ్లేషించడంలో దేవ్ దిట్ట అనిఅంటారు.  దీనికితోడు దేవ్ లో అధ్యాత్మిక భావాలు చాల ఎక్కువనీ ఈవిషయాలే పవన్ తో దేవ్ ను సన్నిహితంగా మార్చాయి అని కూడా అంటారు. అయితే గతంలో భారతీయ జనతాపార్టీతో ఇతడికి ఉన్న సాన్నిహిత్యంతో బిజెపి జనసేనల మధ్య వారధిగా ఒక అజ్ఞాత వ్యక్తి పాత్రను దేవ్ పోషిస్తాడు అన్న వ్యూహంతో దేవ్ ను పవన్ దగ్గరకు చేర్చుకున్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: