పాత కేసులనన్నింటినీ ఒక కొలిక్కి తీసుకురావాలని తెలంగాణా  సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసినదే. దీంతో ఓటుకు నోటు వ్యవహారం కూడా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇక దాన్ని పట్టుకొని ఏపీలోని టీడీపీ ప్రత్యర్థులు బాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా అయితే ఏకంగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బాబును జైల్లో పెడతామని హెచ్చరించింది.


ఇక ఆమె చేసిన వాఖ్యలపై మంత్రి ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. ఒక ఛానల్ విలేఖరితో మాట్లాడిన ఆయన ఆమెపై విమర్శలు గుప్పించారు. తండ్రి వయసున్న చంద్రబాబు పై ఇంత నీచమైన కుట్రపూరిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని ఆయన వాఖ్యానించారు. జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు రాజకీయాల్లో  నడవవని, రాజకీయ నాయకులు ఒక మాట మాట్లాడేముందు దానికి కట్టుబడి ఉండాలని ఆయన తెలిపారు.


ప్రజలకోసం చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారో  ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ పార్టీ అధినేత చంద్రబాబుపై దుష్ప్రచారం చేయడం ఆపాలని చెప్పారు. రోజా రాజకీయాలు వదిలి సినిమాలు, సీరియళ్లు చేసుకుంటే డబ్బుకి డబ్బు, మంచిపేరు వస్తుందని మంత్రి ఆది ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: