savitri caste కోసం చిత్ర ఫలితం
దక్షిణ భారత మహోన్నత నటీమణి సావిత్రిగారి జీవితకథగా రూపొందిన "మహానటి" సినిమాకి ఒక పక్కవైపు ప్రేక్షకులు తమ ఆరాధనాభావంతో ఆమె సినీఙ్జాపకాలు నెమరు వేసుకుంటూ ఉంటే, ఇంకో పక్క ఒకవర్గం మాత్రం సినిమాలోని లోపాల కోసం  రంధ్రాన్వేషణ చెసే పనిలో నిమగ్నమై ఉంది.  
mahanati rajendra prasad కోసం చిత్ర ఫలితం
రంధ్రాన్వేషణలో భాగంగానే సినిమాలో సావిత్రి పెదనాన్న చౌదరి (రాజేంద్ర ప్రసాద్ వేసిన వేషం)  గురించి పలు ప్రస్తావనలు  రాగా,  అసలు "చౌదరి"  కాని సావిత్రిగారి  కుటుంబంలో చౌదరి ఎలా వచ్చి చేరాడు? అని తెలిసిన వారు  అడుగు తున్నారు.



అసలు ఈ చర్చకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి:

సావిత్రిగారి ఇంటి పేరు నిశ్శంకర, ఈ ఇంటి పేరు కాపు సామాజిక వర్గానికి చెందినది, సావిత్రి గారి కుటుంబం కాపులు. సావిత్రి గారి తండ్రి చిన్ననాడే మరణిస్తే, వేరే ఆధారం లేని సావిత్రిగారి తల్లి, తన అక్కయ్య ఇంటికి తీసుకొస్తుంది సావిత్రిగారిని.  అంటే ఆమె సావిత్రికి పెద్దమ్మ అన్నమాట. ఈ సినిమాలో చూపించిన చౌదరి గారు సావిత్రి పెద్దమ్మ భర్త. చౌదరి అంటే కమ్మ సామాజిక వర్గం.
savitri mother & father కోసం చిత్ర ఫలితం
పెద్దమ్మ పెద్దనాన్నల ఇద్దరిది ప్రేమ-కులాంతర వివాహం అందుకే ఆయన పేరులో చౌదరి ఉంది. ఇక సావిత్రి గారు వివాహం చేసుకొంది తమిళ సద్బ్రాహ్మణుడైన జెమినీ గణేశన్ ని. కాబట్టి సావిత్రి గారి తల్లి కుటుంబం కాపు, పెంచిన పెదనాన్న కుటుంబం కమ్మ, ప్రేమించి పెళ్ళి చేసుకున్న జెమిని గణేషణ్ తమిళ బ్రహ్మణుడు అంటే భర్త.  వీటికి పూర్తిగా విరుద్ధమైన బ్రాహ్మణ జాతి.
savitri & gemini ganeshan కోసం చిత్ర ఫలితం
అంటే సావిత్రిగారు కులం అదృష్టవశాత్తూ 'త్రివేణీ సంగమం ' లాగా  'త్రికుల సంగమం' అన్నమాట-కాపు, కమ్మ, బ్రహ్మణ అదీ తమిళ బ్రాహ్మణ-లేకుంటే మనోళ్ళు ఆమెది మా కులమంటే మా కులమని కుక్కల్లా కొట్టుకునేవాళ్ళు. యాదృచ్చికంగా ఆమె మనలో మనకు కుల గొడవలు పెట్టకుండా తనకులం బహుముఖం చేశారు. అంటే తనకు తెలియ కుండానే  ఆమె కుల, బాషా, ప్రాంత సరిహద్దు, లను చెరిపేసి దేశ వ్యాప్త నటి అయ్యారన్న మాట. 
mahanati rajendra prasad కోసం చిత్ర ఫలితం
సామాజిక మాద్యమంలో (సోషల్ మీడియా) సావిత్రిగారి సామాజిక వర్గం గురించి రకరకాల వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలతో  పాటు వివిధ రకాల పోస్టింగ్స్  వరదలా వస్తున్న నేపధ్యంలో మాకు తెలిసిన నూరు శాతం విశ్వసనీయ సమాచారం మీకు పంచుతూ స్పష్టత ఇవ్వడం జరిగింది. కాబట్టి, సావిత్రి గారు కులాతీత, భాషాతీత,భావాతీత, ప్రాంతాతీత, 'విశ్వజనీన నవ నవోన్వేషిత కళా సామ్రాఙ్జి' కళ దైవస్వరూపం. దైవానికి కులం ఉండదు కదా! 


ఒక కళాకారిణిగా ఆమె ఏ ఒక్క సామాజిక వర్గానికో, కులానికో, యాదృచ్చికంగా కూడా పరిమితమవలేదు. ఈ భేద విభేదాలను ప్రశ్నించే సహజమైన కళాకారిణి అంటే మహానటి అన్నిటికీ అతీతమైన వినోదం పంచే సినిమా రంగంలో రారాణిగా ఎదిగారు.
savitri with rekha photos కోసం చిత్ర ఫలితం
కాబట్టే అందరు అభిమానించే ఆరాధించే ప్రేమించే మహానటి అయ్యారు. ఆవిడ సామాజిక వర్గంపై కూడా, ఆమె తండ్రి చౌదరి అని ఉండటంతో కులాల కుంపటైన, మన అమరావతిలో చర్చోపచర్చలు జరుగుతున్నందున ఆమె కులం గురించి గతంలో  మా చిన్నతనం నుండీ తెలిసిన విషయాలను విశ్లేషణగా వివరించవలసి వచ్చింది. 


ఆమె ఏ ఒక్క కులానికి చెందని-అందరికి చెందిన 'విశ్వజనీన మహానటి' మాత్రమే. 

savitri & gemini ganeshan కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: