చంద్రబాబునాయుడుకు శిక్ష త‌ప్ప‌దా ?  భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు అవున‌నే అంటున్నారు. రాజ‌మండ్రిలో మీడియాతో బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, 2019లో ప్ర‌జా కోర్టులో చంద్ర‌బాబుకు శిక్ష త‌ప్ప‌ద‌ని తీవ్రంగా హెచ్చ‌రించారు. బిజెపి నేత‌ల హెచ్చ‌రిక‌లు చూస్తుంటే చంద్రబాబు పై ఉన్న కేసుల విచార‌ణ‌ను వేగ‌వంతం చేయ‌టానికి పెద్ద ప్లానే వేస్తున్న‌ట్లు అనుమానంగా ఉంది.  త‌న‌పై ప్ర‌త్య‌ర్ధులు పెట్టిన కేసులేవీ ఏ విచార‌ణ‌లో కూడా రుజువుకాలేద‌ని,  న్యాయ‌స్ధానాలు త‌న‌కు క్లీన్ చిట్ ఇచ్చిన‌ట్లు చంద్ర‌బాబు చెప్పుకుంటున్నారు.  చంద్ర‌బాబుపై న్యాయ‌స్జానాల్లో చాలా కేసులే ఉన్నాయి. నిజానికి ఏ కేసులో కూడా చంద్ర‌బాబుకు ఏ కోర్టు కూడా క్లీన్ చిట్ ఇవ్వ‌లేద‌న్న‌ది వాస్త‌వం.

Image result for vote for note

విచార‌ణ అడ్డుకుంటూనే ఉన్నారు
ఎందుకంటే,  కోర్టుల్లోని కేసుల విచార‌ణ‌ను చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు అడ్డుకుంటునే ఉన్నారు.  ఏ కోర్టు కూడా త‌న‌పై ఉన్న కేసుల్లో విచార‌ణ జ‌ర‌ప‌టానికి వీల్లేకుండా చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు స్టేలు తెచ్చుకుంటూనే ఉన్నారు. ఎప్ప‌టి నుండో ఉన్న కేసుల సంగ‌తిని ప‌క్క‌న‌పెట్టినా తాజాగా ఓటుకునోటు కేసును తీసుకున్నా అదే వ‌ర‌స‌. 2015లో ఓటుకునోటు కేసు వెలుగు చూడ‌టం అప్ప‌ట్లో దేశంలోనే పెద్ద  సంచ‌ల‌నం. కేసులో తెర‌పైన తెలంగాణా ఎంఎల్ఏలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌లు కేసులో ఇరుక్కున్నా తెర‌వెనుకుండి వారిని న‌డిపించిన సూత్ర‌ధారి మాత్రం చంద్ర‌బాబే అని  జ‌నాల్లో బాగా  ప్ర‌చారం ఉంది. ఆ కేసులో త‌న ప్రేమ‌యంపై విచార‌ణ జ‌ర‌గ‌కుండా చంద్ర‌బాబు స్టే తెచ్చుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

Image result for somu virraju

కేసులు తిర‌గ‌తోడుతారా ?
క్షేత్ర‌స్ధాయిలో వాస్త‌వాల‌ను ప‌రిశీలీస్తే చంద్ర‌బాబుపై ఉన్న కేసుల‌ను బిజెపి నేత‌లేమ‌న్నా తిర‌గ‌తోడుతారా అన్న విఫ‌యంపై జ‌నాల్లో బాగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఓటుకునోటు కేసులో చంద్ర‌బాబు ప్రమేయంపై స్ప‌ష్ట‌త‌నివ్వాల‌ని వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డి సుప్రింకోర్టులో దాఖ‌లు వేసిన కేసు విచార‌ణ‌కు వ‌స్తోంది. ఆ కేసును వేగ‌వంతం చేస్తే చాలు చంద్ర‌బాబు సంగ‌తి అంతే. ఆ అనుమానం ఉంది కాబ‌ట్టే చంద్ర‌బాబు కూడా త‌ర‌చూ త‌న‌పై కేంద్రం కేసులు పెట్టే అవ‌కాశాలున్నాయ‌ని ఆందోళ‌న ప‌డుతున్నారు. మొత్తం మీద ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబుకు ఎప్పుడు ఏ కేసు ఇబ్బంది పెడుతుందో స‌స్పెన్స్ గా మారిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: